Telangana

News May 9, 2024

HYD: 24 గంటల్లో రూ.28.43 లక్షలు స్వాధీనం

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.28,43,735 నగదు, రూ.5,55,605 విలువైన ఇతర వస్తువులు, 33.50 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆరుగురిపై FIR  నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.22.5 కోట్ల నగదు, రూ.17.93 కోట్ల విలువైన వస్తువులు, 26.83 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.

News May 9, 2024

HYD: భారీగా బంగారం, వెండి, నగదు స్వాధీనం

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3.16 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బాచుపల్లిలో రెండు బైకులపై తరలిస్తున్న రూ.22 లక్షల నగదు పోలీసులు గుర్తించారు. డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో క్యాష్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.

మందకృష్ణ మాదిగను కలవడం ఆనందంగా ఉంది: మోదీ

image

వరంగల్ నగరంలో జరిగిన ర్యాలీలో నా తమ్ముడు మందకృష్ణ మాదిగని కలవడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ అంతటా కాంగ్రెస్ మాదిగ వ్యతిరేక వైఖరిపై చర్చ జరుగుతోందని తెలిపారు. వారు మాదిగ సామాజిక వర్గానికి దక్కాల్సిన అవకాశం, గౌరవం లేకుండా చేశారని, మాదిగ సామాజికవర్గం సంక్షేమం కోసం బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

News May 9, 2024

బొంరాస్‌పేట: భవనం పైకప్పు కూలి మృతి.. పరిహారం కోసం ఆందోళన

image

భవనం పైకప్పు కూలి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన తాండూరులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బొంరాస్ పేట మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య (44) తాండూరులో కూలి పనికి వెళ్ళాడు. పనులు చేస్తుండగా పైకప్పు స్లాబు కూలి వెంకటయ్యపై కూలగా అక్కడికక్కడే మరణించాడు. జేసీబీ సహాయంతో బయటకి తీశారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని అర్థరాత్రి వరకు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని సముదాయించారు.

News May 9, 2024

HYD: కిషన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి: దానం

image

తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు కేంద్రం నుంచి తెచ్చానన్న కిషన్ రెడ్డి.. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ. 10 లక్షల కోట్లు తెస్తే సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

భూపాలపల్లి: తండ్రి బీట్ ఆఫీసర్.. కుమారుడు IFS 

image

యూపీఎస్సీ బుధవారం ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన పోరిక లవ కుమార్ విజయ కేతనం ఎగరవేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన లవ కుమార్ 2017 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నిన్న విడుదల చేసిన ఫలితాల్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. లవ కుమార్ తండ్రి సూరి దాస్ సైతం అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.

News May 9, 2024

ఖానాపూర్: నలుగురు బీజేపీ నాయకులపై కేసు నమోదు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నలుగురు బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు ఖానాపూర్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఖానాపూర్‌లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పర్యటన సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సమయాన్ని ఉల్లంఘించారన్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అంకం మహేందర్ లపై కేసు నమోదు చేశామని ఖానాపూర్ ఎస్సై లింబాద్రి వెల్లడించారు.

News May 9, 2024

MDK: రైలు ఢీకొని కామారెడ్డి యువకుడి మృతి

image

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని <<13209937>>రైలు ఢీకొట్టిన<<>> ఘటనలో మృతుడి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మాలోత్ ప్రకాశ్‌గా గుర్తించారు. తన సొంత పనులపై బైక్‌పై మెదక్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ప్రకాశ్ బంధువుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.