India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో 3 ప్రధాన పార్టీలు ముఖ్యనేతలను రప్పించి రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, CM రేవంత్ రెడ్డిల బహిరంగ సభను ఈనెల 11న కామారెడ్డిలో ఏర్పాటు చేశారు. పోల్‌మేనేజ్‌మెంట్‌ను పక్కాగా చేపట్టేందుకు అభ్యర్థులు, నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
మాజీ గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌పై ఈసీకి బీఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి జి.కిషన్ రెడ్డికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కాలనీలో తమిళిసై ఎన్నికల ప్రచారం చేశారని, ఆ సమయంలో ఓటర్లకు అయోధ్య రామమందిర నమూనాలను పంపిణీ చేశారన్నారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.
అమీర్‌పేట్‌లో అత్యాచారం కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. వనపర్తికి చెందిన యువతి ఎల్లారెడ్డిగూడలో తన అక్క ఇంటికి వచ్చింది. సమీపంలో ఉంటున్న సాయికృష్ణ యువతికి బంధువు కావడంతో చనువుగా ఉండేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని, అన్నం వండిపోవాలని పిలిచి యువతిపై సాయికృష్ణ అత్యాచారం చేశాడు.వారికి వరుస కుదరక పెద్దలు పెళ్లికి నో చెప్పారు. ఫొటోలు వైరల్ చేస్తానని యువకుడు బెదిరించడంతో యువతి PSలో ఫిర్యాదు చేసింది.
అమీర్‌పేట్‌లో అత్యాచారం కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. వనపర్తికి చెందిన యువతి ఎల్లారెడ్డిగూడలో తన అక్క ఇంటికి వచ్చింది. సమీపంలో ఉంటున్న సాయికృష్ణ యువతికి బంధువు కావడంతో చనువుగా ఉండేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని, అన్నం వండిపోవాలని పిలిచి యువతిపై సాయికృష్ణ అత్యాచారం చేశాడు.వారికి వరుస కుదరక పెద్దలు పెళ్లికి నో చెప్పారు. ఫొటోలు వైరల్ చేస్తానని యువకుడు బెదిరించడంతో యువతి PSలో ఫిర్యాదు చేసింది.
కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మంగపేట PHC పరిధిలోని పొగళ్లపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో ఏఎన్ఎం-1గా విధులు నిర్వహిస్తున్న పుష్పలత(35)గత నెల 27న విధులకు భర్త శ్రీనివాస్‌తో కలిసి బైక్‌పై పాల్వంచ నుంచి బయల్దేరింది. పాతూరు శివారులో ఎదురుగా వచ్చిన స్కార్పియో ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుష్పలత బుధవారం మృతిచెందారు.
ఊయల కట్టిన స్టూల్ మీద పడి చిన్నారి మృతి చెందింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లోక్‌నాథ్ ఖర్ష్ తాపీమేస్త్రీ-భారతి దంపతులకు ముగ్గురు పిల్లలు. నాలుగేళ్ల కిందట కుటుంబంతో సహా కాజీపేటకు వలస వచ్చారు. ఆయన భార్య సోమిడిలో నిర్మాణంలో ఉన్న ఇంటి దర్వాజ, ఇనుప స్టూలుకు చీరతో ఊయల కట్టి చిన్నారి రోషిత (6 నెలలు)ను అందులో పడుకోబెట్టింది. స్టూల్ అదుపు తప్పడంతో ఊయలలో ఉన్న చిన్నారి కిందపడి గాయాల పాలై చనిపోయింది.
విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరగనుంది. తమ సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు తుది సన్నాహాల్లో ఉన్నారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ నిఖత్ జరీన్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించారు. నిఖత్‌తో పాటు ప్రీతి పవార్, పర్వీన్ హుడా, లవ్లీనా బోర్గోహైన్ పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. ఇక దేశం మొత్తం నిఖత్ జరీన్ బంగారం లాంటి ప్రదర్శన చేస్తుందని ఎదురు చూస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూడు చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పోలీసులు బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని మూడు కాలనీల్లో ఆకస్మికంగా దాడులు చేశారు. అక్కడ వ్యభిచారం చేస్తున్న ఆరుగురు యువతులను, ఎనిమిది మంది విటులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
వేసవిలో ఎన్నికల నిర్వహణ అభ్యర్థులతో పాటు అధికారులకు సవాల్‌గా మారింది. మావోయిస్టు ప్రాంతమైన పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మంథని, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. 2019లో ఇక్కడ 65.43 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2014లో ఇది 71.70 శాతంగా ఉంది. పోలింగ్ శాతం పెరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తి ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్(సీబీ ఎస్ఈ-ఆంగ్ల మాధ్యమం) MPC, బైపీసీ, CEC కోర్సుల్లో ప్రవేశాలకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బాలానగర్ ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 19 నుంచి ఏకలవ్య ఆదర్శ పాఠశాల బాలానగర్‌లో విద్యార్థులు టెన్త్ మార్కుల జాబితా, ఆధార్, ఫొటోలు కులం సమర్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.