Telangana

News May 9, 2024

నేడు భువనగిరికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా

image

కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం భువనగిరికి రానున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా రాయగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు 50 వేల మందిని సమీకరించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనాన్ని తరలించనున్నారు. 

News May 9, 2024

నేడు నిర్మల్ జిల్లాలో KTR పర్యటన

image

నేడు నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు భైంసాలో రోడ్డు షో నిర్వహించనున్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు.

News May 9, 2024

ఇల్లెందులో నేడు తమిళిసై రోడ్ షో

image

మహబూబాబాద్ లోక్‌సభ స్థానం BJP అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్‌కు మద్దతుగా ఆపార్టీ నాయకురాలు తమిళిసై ఇల్లెందులో నేడు రోడ్ షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గోపీకృష్ణ బుధవారం తెలిపారు. ఈ రోడ్ షో కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

News May 9, 2024

NZB: ఒకే రోజు 2 మీటింగ్లు.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్

image

NZB జిల్లాలో CM రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. NZB లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డికి మద్దతుగా ఆయన బుధవారం ఆర్మూర్, NZBలో ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేవంత్ తన ప్రసంగాలతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని సూచించారు.

News May 9, 2024

పార్లమెంట్ ఎన్నికలపై ముందస్తు భద్రత చర్యలు: ఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులను కట్టడి చేసేందుకు జిల్లా పోలీసు కార్యాచరణ రూపొందించి, నిఘా పెంచి అన్ని కోణాల్లో దృష్టి సారించామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 693 మంది పాత నేరస్థులు, రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు.

News May 9, 2024

పోస్టల్ బ్యాలెట్ గడువు పొడగింపు: కలెక్టర్ సంతోష్

image

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే వారికి ఈ నెల 10 వరకు గడువును పొడిగించినట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టరేట్ ఐడీవోసీ లో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు.

News May 9, 2024

ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి , శంకర నంద్ మిశ్రాలతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో రిటర్నింగ్ అధికారి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియకు దగ్గర పడుతున్నందున నిబంధనలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

News May 9, 2024

రేపు ఒక్కరోజే వరంగల్ మార్కెట్ ఓపెన్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు(గురువారం) ప్రారంభం కానుంది. నేడు అమావాస్య, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు సెలవు ప్రకటించారు. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. ఉదయం నుంచి మార్కెట్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
గమనిక: శుక్రవారం నుంచి మార్కెట్‌కు వరుసగా 6 రోజులు సెలవులు రానున్నాయి.

News May 9, 2024

హామీలు ఇచ్చి మోసం చేసిన కవిత, అర్వింద్: రేవంత్ రెడ్డి

image

నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఎంపీలుగా కల్వకుంట్ల కవిత, అర్వింద్ ధర్మపురి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం రాత్రి ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. వందరోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తామని మాట తప్పిన కవితను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించారిని విమర్శించారు. ఇక ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఐదేళ్లుగా అర్వింద్ మోసం చేశారని ఆరోపించారు.

News May 9, 2024

నేడు ఆదిలాబాద్ జిల్లాకు మాజీ గవర్నర్ రాక

image

బీజేపీ ఎంపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లాకు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రానున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం పట్టణంలోని కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న సమావేశానికి ఆమె హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి స్టార్ క్యాంపెనర్‌గా ఆమె జిల్లాకు
వస్తున్నట్లు వెల్లడించారు.