Telangana

News July 19, 2024

HYD: అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపేసిన మహిళలు

image

అసభ్యంగా ప్రవర్తించాడని‌ ఓ యువకుడిపై మహిళలు దాడి చేశారు. దెబ్బలు తాళలేక కుప్పకూలిన అతడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధి ప్రకాశ్‌నగర్‌లో కుమార్(35)ను <<13660377>>చెట్టుకు కట్టేసి కొట్టారు<<>>. మిస్‌బిహేవ్ చేశాడని‌ విచక్షణ రహితంగా దాడి చేయడంతో‌ చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. RGIA పోలీసులు విచారణ చేపట్టారు.

News July 19, 2024

HYD: అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపేసిన మహిళలు

image

అసభ్యంగా ప్రవర్తించాడని‌ ఓ యువకుడిపై మహిళలు దాడి చేశారు. దెబ్బలు తాళలేక కుప్పకూలిన అతడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధి ప్రకాశ్‌నగర్‌లో కుమార్(35)ను <<13660377>>చెట్టుకు కట్టేసి కొట్టారు<<>>. మిస్‌బిహేవ్ చేశాడని‌ విచక్షణ రహితంగా దాడి చేయడంతో‌ చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. RGIA పోలీసులు విచారణ చేపట్టారు.

News July 19, 2024

నిజామాబాద్‌లో కుక్కల బెడదకు చెక్..!

image

నిజామాబాద్ నగరంలో కుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాలనీల్లో కుక్కల బెడద ఉంటే 08462-220234 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా కాలనీల్లో యానిమల్ బర్త్ కంట్రోల్ టీంలను రంగంలోకి దించారు. బృందాల సభ్యులు వీధుల్లోని శునకాలను పట్టుకుని వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు.

News July 19, 2024

NLG: ఉపకార వేతనాల కోసం ఎదురుచూపు

image

ఉపకార వేతనాల కోసం ఇంటర్ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివిన విద్యార్థులకు ఇంతవరకు స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో 2023-24 సంవత్సరంలో విద్యనభ్యసించిన వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు.

News July 19, 2024

వృద్ధురాలితో ముచ్చటించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

image

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పర్యటించారు. పర్యటనలో భాగంగా వృద్ధురాలితో మాట్లాడి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా రంజక పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.

News July 19, 2024

ములుగు: గోదావరిలో ఒకరు గల్లంతు

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గోదావరి నదిలో ఒకరు గల్లంతయ్యారు. స్థానికుల ప్రకారం.. వెంకటాపురం పరిధిలోని అలుబాక గ్రామ సమీపంలోని గోదావరిలో శుక్రవారం మధ్యాహ్నం బానారి రాజు( 45) అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు గల్లంతయిన రాజు కోసం నాటు పడవ ద్వారా గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 19, 2024

జలకళ సంతరించుకున్న మేడిగడ్డ బ్యారేజ్

image

మేడిగడ్డ బ్యారేజీకి ఇటీవల కురిసిన వర్షాల వల్ల భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 1,93,550, క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అధికారులు 85 గేట్లను ఎత్తి మొత్తం నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాలేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ.. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ప్రస్తుత నీటిమట్టం 8 మీటర్లు ఉంది.

News July 19, 2024

ఖమ్మం: జ్వరంతో ఆర్మీ జవాన్ మృతి

image

జ్వరంతో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో జరిగింది. కుటుంబసభ్యుల వివరాలు.. భాగ్యనగర్ తండాకి చెందిన టీ.బాలాజీ 10 సంవత్సరాలుగా ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 10 రోజుల క్రితం జ్వరం వస్తుందని ఉత్తరప్రదేశ్ నుంచి స్వగ్రామమైన భాగ్యనగర్ తండాకు వచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాదుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

News July 19, 2024

NLG: కుట్టు కూలీ సొమ్ము మంజూరు

image

ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కొక్క విద్యార్ధికి రూ.50 చొప్పున కుట్టు కూలీ సొమ్ము మంజూరైంది. ఏకరూప దుస్తుల కుట్టు పనులను గ్రామైక్య సంఘాల మహిళలకు అప్పగించగా దాదాపుగా కుట్టు పనులు పూర్తి కావొచ్చాయి. BNG జిల్లాలో 40,059 మంది విద్యార్థులు ఉండగా రూ.20,02,950, NLG జిల్లాలో 74,090 మంది విద్యార్థులు ఉండగా రూ.37,04,500, SRPT జిల్లాలో 45530 విద్యార్థులకు 22,76,500 మంజూరయ్యాయి.

News July 19, 2024

కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో ఎంపీ అరవింద్ భేటీ

image

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌తో శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు అరవింద్ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు విషయాలను చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగనున్న నేపథ్యంలో ఇరువురు భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.