India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
DRDO, DWO, MEPMA వారి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్లో ఓటర్ అవేర్నెస్ ‘స్వీప్’ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా పాల్గొని మహిళల అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, దీనిని గమనించి అర్హులైన మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు
రాష్ట్రంలో ఉచిత నాణ్యమైన విద్యను అందరికీ అందించడంతో పాటు ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్‌తో తాను NLG- WGL- KMM గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బరిలో నిలుస్తున్నట్లు సీనియర్ జర్నలిస్ట్ పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు.
✓ కొడంగల్ అసెంబ్లీలో – 2,41,794
✓ నారాయణపేట – 2,36,182
✓ మహబూబ్‌నగర్ – 2,59,260
✓ జడ్చర్ల – 2,22,838
✓ దేవరకద్ర – 2,39,745
✓ షాద్‌నగర్ – 2,38,478
✓ మక్తల్ – 2,44,173
✓ వనపర్తి – 2,73,863
✓ గద్వాల – 2,56,637
✓ అలంపూర్ – 2,40,063
✓ నాగర్‌కర్నూల్ – 2,36,094
✓ అచ్చంపేట – 2,47,729
✓ కల్వకుర్తి – 2,44,405
✓ కొల్లాపూర్ – 2,39,463 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో వనపర్తిలో అత్యధిక ఓట్లు ఉన్నాయి.
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలీసెట్ 2024కు రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏఎస్బిటిఈటి కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. దరఖాస్తు చేసుకొని వారు, ఆసక్తిగల విద్యార్థులు సత్వరమే తమ దరఖాస్తులు నమోదు చేసుకోవాలని సూచించారు.
POLYCET ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు ఆలస్య రుసుము రూ.100తో ఈ నెల 7న ముగిసింది. కాగా దరఖాస్తు గడువు ఈ నెల 14 వరకు పొడగించినట్లు ఆదిలాబాద్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ భరద్వాజ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
కామారెడ్డిలో ఓడిన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్లలో ఏ మొఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నాడని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘునందన్‌రావు మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ దుబ్బాకలో చెల్లని నోటు మెదక్‌లో చెల్లుతుందా అని చేసిన వాక్యలపై ఆయన మండిపడ్డారు. బీజేపీ చేతిలో ఓడిన కేసీఆర్ BRS ఎంపీలను ఎట్లా గెలిపిస్తాడని ప్రశ్నించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 6 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 13న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 10(శుక్రవారం) నుంచి 15(బుధవారం) వరకు 6రోజుల సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి మార్కెట్ 16(గురువారం)న ప్రారంభం కానుంది. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని కోరారు.
HYDలో నిన్న కురిసిన గాలివాన 11 మందిని బలితీసుకొంది. బహదూర్‌పురాలో కరెంట్ పోల్ తగిలి షాక్‌తో ఫక్రూ(40) చనిపోయారు. బేగంపేట నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. బాచుపల్లిలో గోడకూలి ఏకంగా ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో పంక్చర్ షాప్‌లో ఉన్న వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయారు. అకాల వర్షానికి ఒక్కరోజే 11 మంది చనిపోవడం HYDలో ఇదే తొలిసారి.
HYDలో నిన్న కురిసిన గాలివాన 11 మందిని బలితీసుకొంది. బహదూర్‌పురాలో కరెంట్ పోల్ తగిలి షాక్‌తో ఫక్రూ(40) చనిపోయారు. బేగంపేట నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. బాచుపల్లిలో గోడకూలి ఏకంగా ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో పంక్చర్ షాప్‌లో ఉన్న వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయారు. అకాల వర్షానికి ఒక్కరోజే 11 మంది చనిపోవడం HYDలో ఇదే తొలిసారి.
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు ప్రధానమంత్రికి గదను బహుకరించారు. వారి కోరిక మేరకు నరేంద్ర మోదీ గదను ఎత్తి, ప్రజలకు అభిమానం చేశారు. ఈ సన్నివేశాన్ని చూసిన కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ‘జై మోదీ’ అంటూ నినాదాలు చేశారు.
Sorry, no posts matched your criteria.