India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. బుధవారం ఖమ్మంలో కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తమ్మల మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిందని రైతులెవరూ అధైర్యపడవద్దని.. ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని అన్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. ఈనెల 13న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రత్యేక బలగాల అధికారులతో సిద్దిపేట పోలీస్ కమిషనర్ తన కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహన తనిఖీలు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
NZB లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా CM రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత నెల 22న NZBలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన బుధవారం NZB, ఆర్మూర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. కేవలం పక్షం రోజుల గ్యాప్‌లో జిల్లాకు రెండో సారి వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. మరో పక్క ఈ నెల 11న KMR జిల్లా ఎల్లారెడ్డిలో ప్రియాంక గాంధీ ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింది.
సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య మృతదేహం జగ్గయ్యపేటలో లభ్యమైంది. పథకం ప్రకారం ఎల్లయ్యను హత్య చేసిన జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ శివారులో మృతదేహాన్ని నిందితులు కాల్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జగ్గయ్యపేట తహశీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో సిరొంచ తాలూకా, పోచంపల్లికి చెందిన రామక్క అనే మహిళ కాళేశ్వరం గోదావరి వద్ద పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో.. గోదావరి నుంచి తీరం వరకు ఎస్సై భవాని సేన ఎడ్ల బండి ద్వారా తీసుకువచ్చి అనంతరం మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో అద్దంకి దయాకర్.. రాముడు, సీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని బీజేపీ నేతలు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మోకిలా PSలో తాము అద్దంకి దయాకర్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు వెంకటేశ్, రాజచంద్ర, యాదయ్య, కృష్ణ, హరినాథ్, లింగం, కర్ణాకర్ చారి, కృష్ణ ఉన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో మామునూర్‌లో భారీ జన సభ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తకు చెందిన ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ చిన్నారిని ప్రధాని ఆప్యాయంగా ముద్దాడారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి చెందిన ప్రముఖ వ్యాపారి జన్నావార్ కిషోర్ (68) ఆస్ట్రేలియాలో మృతి చెందారు. జిల్లాలోని వ్యాపార ప్రముఖుల్లో ఒకరైన కిషోర్ ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ సిటీలో మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న కొడుకు వద్దకు ఇటీవల వెళ్లిన ఆయన అనారోగ్యంతో అక్కడే మృతి చెందారు.
రాజధాని పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో BRSను గెలిపించేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. నేడు KCR బస్సు యాత్ర కూడా నగరానికి చేరనుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెంచేలా నేతలకు KTR సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో HYDలో 17 సీట్లను BRS గెలవగా దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.
రాజధాని పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో BRSను గెలిపించేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. నేడు KCR బస్సు యాత్ర కూడా నగరానికి చేరనుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెంచేలా నేతలకు KTR సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో HYDలో 17 సీట్లను BRS గెలవగా దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.
Sorry, no posts matched your criteria.