India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని బరిలోకి దింపిందని వేములవాడ సభలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఎలాంటి దర్యాప్తు చేయలేదని చెప్పారు. పీవీ నరసింహరావుకి భారతరత్న ప్రకటించి బీజేపీ గౌరవించిందని తెలిపారు.
జైపూర్ మండలంలోని కుందారం జైపూర్ క్రాస్ రోడ్డు సమీప అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. అడవిలో చిరుతపులి అడుగులు గుర్తించినట్లు అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్ తెలిపారు. కుందారం సమీపంలోని అటవీ సంస్థ నీలగిరి ప్లాంటేషన్ వద్ద రెండు రోజుల క్రితం సంచరించిన చిరుత పులి పాదముద్రలు గుర్తించామని పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సీటుపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఆర్ఎస్పీకి మద్దతుగా ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ కల్వకుర్తి, అచ్చంపేటలో పర్యటించనున్నారు. ఇక్కడ గెలుపుపై సానుకూల పవనాలు ఉన్నట్లు పార్టీ నాయకులు అంటున్నారు.
భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోదీని గద్దె దింపుదామని మాజీ ఐఏఎస్ అధికారి, జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళీ అన్నారు. ఓటర్ల చైతన్య బస్సు యాత్ర బుధవారం గజ్వేల్ పట్టణానికి చేరుకుంది. ప్రజా సంక్షేమాన్ని, సుస్థిర అభివృద్ధిని గాలికి వదిలి అధికారం కొరకు విద్వేషాలు రెచ్చగొడుతూ, సమాజాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్న మోదీని ఓడించాలన్నారు.
HYDలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పలుచోట్ల కనీసం రోడ్లపై నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ రంగంలోకి దిగారు. నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, త్వరత్వరగా చర్యలు చేపట్టాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

HYD, RR, MDCL,VKB జిల్లాల పరిధిలో వర్ష బీభత్సం, ఈదురు గాలులకు రాత్రి అనేక చోట్ల కరెంట్ స్తంభించి పోయింది. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. పలు చోట్ల కరెంట్ తీగలు తెగిపడ్డాయి. అనేక చోట్ల విధ్వంసకర పరిస్థితి ఏర్పడింది. విషయాన్ని తెలుసుకున్న విద్యుత్ శాఖ ఇంజినీర్లు, లైన్ మెన్, సిబ్బంది, అధికారులు అర్ధరాత్రి నిద్రహారాలు మాని ప్రజలకు కరెంట్ పునరుద్ధరించడంలో నిమగ్నమయ్యారు.

HYDలో కురిసిన వర్షం, ఈదురుగాలులకు దాదాపు 480 ఫీడర్ ఏరియాల్లో కరెంట్ సమస్యలు ఏర్పడ్డాయి. నగరంలో 4000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కాస్త రాత్రి ఒక్కసారిగా..1000 మెగావాట్లకు పడిపోయింది. దాదాపుగా 300 ఫీడర్ ఏరియాల్లో అధికారులు మరమ్మతులు చేపట్టి సమస్యలకు చెక్ పెట్టారు. మిగతా ప్రాంతాల్లోనూ కరెంట్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి 2021లో ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

Sorry, no posts matched your criteria.