Telangana

News July 20, 2024

NZB జిల్లా ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ 

image

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నగరంలోని మానిక్ భండార్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య డెలివరీ కోసం శుక్రవారం రాత్రి ఆసుపత్రికి వచ్చాడు. రాత్రి తన మూడేళ్ల బాలుడితో కలిసి ఆసుపత్రి కారిడార్‌లో నిద్రించాడు. లేచి చూసేసరికి బాలుడిని ఎవరో ఎత్తుకెళ్లరాని బాధితుడు తెలిపాడు. వెంటనే ఆసుపత్రిలో ఉన్న పోలీసులకు విషయం చెప్పడంతో వారు కేసు నమోదు చేశారు.

News July 20, 2024

గోదావరిలో గల్లంతైన రాజు మృతదేహం లభ్యం

image

ఆలుబాకకు చెందిన బానారి రాజు చేపలకు వేటకు వెళ్లి గోదావరిలో ప్రమాదవశాత్తు నిన్న గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం రాజు మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. రాజు మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News July 20, 2024

ప్రాజెక్టు తెలంగాణలో.. ఆయకట్టు ఆంధ్రాలో!?

image

పెద్దవాగు కథ చాలా పెద్దదే. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు తెలంగాణలో ఆయకట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రాజెక్టు కు భారీ వర్షాలకు గండి పడింది. చుక్కనీరు లేకుండా పోయింది. 18 వేల ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ఇప్పుడు అంధకారంగా మారింది. ఏజెన్సీ వర ప్రధాయినిగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు అశ్వారావుపేట మండలంలో ఉంది. దాని ఆయకట్టు మాత్రం ఏపీలోని ఏలూరు జిల్లాలో విలీనమైన వేలేరుపాడు మండలంలో ఉంది.

News July 20, 2024

బోనాలు: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

అమ్మ బైలెల్లినాదో.. అంటూ రేపు‌ లష్కర్ హోరెత్తనుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్‌ బలగం‌ అంతా రేపు సికింద్రాబాద్‌‌లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు‌ కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద ఇప్పటికే శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టారు. ‌

News July 20, 2024

బోనాలు: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

అమ్మ బైలెల్లినాదో.. అంటూ రేపు‌ లష్కర్ హోరెత్తనుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్‌ బలగం‌ అంతా రేపు సికింద్రాబాద్‌‌లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు‌ కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద ఇప్పటికే శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టారు. ‌

News July 20, 2024

KMM: దేశంలోనే NO.1 సీఎం రేవంత్ రెడ్డి: రఘురాంరెడ్డి

image

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ప్రారంభించి రేవంత్ రెడ్డి దేశంలోనే నంబర్-1 సీఎం అయ్యారని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రఘురాంరెడ్డి అన్నారు. HYD గాంధీభవన్‌లో వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతులపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. BRSపదేళ్లు అధికారంలో ఉన్నా రైతులు, నిరుద్యోగుల కోసం ఏం చేయలేదని మండిపడ్డారు. కేవలం 7నెలల్లోనే ప్రజల కోసం ఎన్నో పనులు చేశామన్నారు.

News July 20, 2024

NGKL: డీఎస్పీకి ఫిర్యాదు చేసిన మోసపోయిన రైతులు

image

వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలలో రైతులను మోసం చేసి రూ.100 కోట్లకు పైగా డబ్బులను వసూలు చేసిన దొంగ బాబాపై చర్యలు తీసుకోవాలని బాధితులు శుక్రవారం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రెండు జిల్లాల పరిధిలోని 1,426 మంది రైతుల నుంచి బాబా భారీగా డబ్బులు వసూలు చేశాడన్నారు. డబ్బులు అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాడని అన్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

News July 20, 2024

అలుగు పారుతున్న 24చెరువులు

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇన్నాళ్లు వట్టిపోయిన జలాశయాలకు కళ వస్తోంది. ఖమ్మం జిల్లాలోని 984 చెరువులకు గాను శుక్రవారం నాటికి 24 చెరువులు అలుగు పారుతున్నాయి. బేతుపల్లి చెరువులోకి 16 అడుగులకు గాను 17 అడుగులు, జాలిముడి ప్రాజెక్టులోకి 15 అడుగుల పూర్తి స్థాయి మట్టానికి గాను 15.24 అడుగుల మేర నీరు చేరడంతో అలుగు పోస్తున్నాయి. ఇక జిల్లాలోని 860 చెరువుల్లో 25 నుంచి 50 శాతం మేర నీరు చేరింది.

News July 20, 2024

చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

చిట్యాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో పట్టణానికి చెందిన మహిళ సంగిశెట్టి సుగుణమ్మ (69) మృతి చెందారు. బంధువుల వివరాలిలా.. సుగుణమ్మ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. భుజం వరకు చేయి నుజ్జునుజ్జు కావడంతోపాటు, తలకు బలమైన గాయాలయ్యాయి. కామినేని ఆసుపత్రికి తరలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మృతి చెందింది.

News July 20, 2024

UPDATE.. 33 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది శనివారం ఉదయం 9 గంటలకు 32.8 వద్ద గోదావరి ప్రవహిస్తుందని అధికారులు తెలియజేశారు. సాయంత్రం వరకు 40 అడుగులు చేరే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.