Telangana

News March 18, 2024

దక్షిణ తెలంగాణకే తలమానికం మన అమ్రాబాద్ ఫారెస్ట్

image

నల్లమలలోని అమ్రాబాద్ అభయారణ్యం 2,163 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దక్షిణ తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది. అడవిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఉమామహేశ్వర ఆలయాన్ని, మల్లెల తీర్థాన్ని పర్యాటక శాఖ కొంత అభివృద్ధి చేయగా.. వ్యూ పాయింట్, ఆక్టోపస్ వ్యూలను అటవీ శాఖ అభివృద్ధిలోకి తెచ్చింది.

News March 18, 2024

జగిత్యాలలో తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల సభ ద్వారా కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించారు. ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్​లో జగిత్యాల చేరుకున్న మోదీకి పార్టీనాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది.

News March 18, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో గడ్డికి గడ్డుకాలం

image

మూగజీవాలకు పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో రైతులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. ఎండుగడ్డి కొరత తీవ్రంగా ఉండడంతో పశుపోషణ రోజురోజుకు భారంగా మారుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఎడమకాల్వ, మూసీ ప్రాజెక్టు, శాలిగౌరారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులో గతేడాది నీరు సమృద్ధిగా ఉన్న కారణంగా యాసంగిలో లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆయకట్టులో సాగు విస్తీర్ణం తగ్గింది.

News March 18, 2024

మోదీ హయాంలో అన్ని రంగాలలో అభివృద్ధి: జగిత్యాలలో కిషన్ రెడ్డి

image

ప్రధాని మోదీ హయాంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నీతివంతమైన పాలన అందిస్తూ దేశం అన్ని రంగాలలో పురోగమించేలా చేస్తున్నారన్నాని జగిత్యాలలో సోమవారం విజయ సంకల్ప సభలో పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతిమయమేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయలేని పరిస్థితిలో ఉందన్నారు.

News March 18, 2024

జగిత్యాలలో తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల సభ ద్వారా.. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించారు. ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్​లో జగిత్యాల చేరుకున్న మోదీకి పార్టీనాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది.

News March 18, 2024

ఖమ్మం: మహిళా ఓటర్లే అధికం

image

ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,23,814 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 8,39,640 మంది, పురుష ఓటర్లు 7,84,043 మంది ఉండగా, మహిళా ఓటర్లు 55,597 మంది ఎక్కువ. ఇంకా ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 222, సర్వీస్‌ ఓటర్లు 886 మంది ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా 3,22,259 మంది, తక్కువగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,58,647 మంది ఓటర్లు ఉన్నారు.

News March 18, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పలు రకాల సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,400 ధర పలకగా, 341 రకం మిర్చి రూ.16వేల ధర పలికింది. అలాగే వండర్ హాట్ (WH) రకం మిర్చికి రూ.17వేల ధర రాగా, 5531 మిర్చికి రూ.13వేల ధర, టమాటా రకం మిర్చికి రూ.37,000 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News March 18, 2024

MDK: యువకుడి సూసైడ్ 

image

ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన బాలగౌని శేఖర్ గౌడ్ (25) శనివారం సాయంత్రం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శేఖర్ గౌడ్ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అయితే అతడికి మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.

News March 18, 2024

నాగర్ కర్నూల్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్

image

ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూల్(SC) పార్లమెంట్ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీని పార్టీలో చేర్చుకోవడంతోపాటు ఇతర నేతల చేరికపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇప్పటికే తమ అభ్యర్థి భరత్‌ కోసం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇక్కడ తమకు అనుకూల, ప్రతికూల పరిస్థితులపై బీజేపీ లెక్కలు వేస్తోండగా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఎవరన్నది తెలాల్సి ఉంది.

News March 18, 2024

ADB: ముళ్లపొదల్లో మగశిశువు.. వెలుగులోకి సంచలన విషయం

image

ఇటీవల ఓ మగశిశువును ముళ్లపొదల్లో పడేసిన ఘటన భీంపూర్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును పోలీసులు ఛేదించారు. ఆ మగబిడ్డకు జన్మనిచ్చింది మైనర్ బాలికగా గుర్తించారు. సదరు బాలిక గర్భం దాల్చడానికి కారకుడైన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక ఓ హాస్టల్ లో ఉంటూ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. వరుసకు బావనే గర్భం దాల్చడానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.