India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగిస్తూ తుది జాబితాను విడుదల చేశారు. MBNR లోక్ సభ పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 6,713 మంది పురుషులు, 6,508 మంది స్త్రీలు మొత్తం కలిపి 13,221 మంది ఓట్లు తీసేశారు. NGKL లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. 4,480 మంది పురుషులు, 3,983 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు మొత్తం 8,465 మందిని జాబితా నుంచి తొలగించారు.
బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలకు రైతులు బలవుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయాల కోసం నోటికాడి బుక్కను లాక్కోవడం సరికాదని ఆయన ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం చెప్పిన టైమ్‌కు రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసింది. ‘అకౌంట్లలో డబ్బులు పడ్తున్నాయని రైతులు సంతోషపడే లోపలే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిధులు ఆపేలా కుట్రలు చేయడం బాధాకరం’ అని మంత్రి అన్నారు
వికారాబాద్ జిల్లా ధారూర్‌లో ఈనెల 2న BRS కార్యకర్తల సమావేశంలో కుక్కింద గ్రామానికి చెందిన మల్లేశం ప్రమాదవశాత్తు చికెన్ కర్రీ, సాంబార్‌లో పడి గాయపడిన విషయం తెలిసిందే. కాగా మెరుగైన వైద్యం నిమిత్తం అతడిని HYDలోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు. మల్లేశం సోదరుడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం 3 రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రాల్యీలు, రోడ్డు షోలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ ప్రసంగాలకు పదును పెడుతున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో BC ఓట్ల బ్యాంక్ పెద్ద సంఖ్యలో ఉంటుంది. దీంతో BC కులాలపై 3 పార్టీలలు ప్రదానంగా ఫోకస్ పెట్టాయి.
వికారాబాద్ జిల్లా ధారూర్‌లో ఈనెల 2న BRS కార్యకర్తల సమావేశంలో కుక్కింద గ్రామానికి చెందిన మల్లేశం ప్రమాదవశాత్తు చికెన్ కర్రీ, సాంబార్‌లో పడి గాయపడిన విషయం తెలిసిందే. కాగా మెరుగైన వైద్యం నిమిత్తం అతడిని HYDలోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు. మల్లేశం సోదరుడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు సంబంధించి వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోలకు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి కారణమంటూ బీజేపీ నేతలు ఎన్.రామచందర్‌రావు, గోకుల రామారావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈటల పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వీడియోలు వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరారు.

ఈసీ ఆదేశాలతో పాలమూరులో రైతు భరోసాకు బ్రేక్ పడింది. ఉమ్మడి జిల్లాలో 11.25 లక్షల మంది రైతులు ఉండగా వారందరికీ ఏటా రూ.1,256 కోట్ల పెట్టుబడి సాయం అందేది. అయితే మంగళవారం వరకు MBNR-2.6 లక్షల మంది రైతులకు రూ.164 కోట్లు, NGKL- 3.6 లక్షల మందికి రూ.370 కోట్లు, GDWL-1.63 లక్షల మందికి రూ. 227 కోట్లు, WNPT-175 లక్షల మందికి రూ.181 కోట్లు, NRPT-1.77 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.225.17 కోట్ల చెల్లింపులు జరిగాయి.
ఒకప్పుడు పట్టణాల్లో ఉండే ఆన్లైన్ జూదం ఆటలు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యంతో ఇప్పుడు గ్రామాల్లోకి చేరాయి. క్రికెట్ బెట్టింగ్, పేకాట, ఇతర ఆటల వల్ల యువకుల <<13198225>>ప్రాణాలను బలిగొంటూ<<>> కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి సాఫ్ట్వేర్ ఉద్యోగి రెండు రోజుల క్రితం ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
HYDలో రాత్రి కురిసిన భారీ వర్షం పది మంది మృత్యువాతకు కారణమైంది. బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు చనిపోగా పాతబస్తీ బహదూర్‌పురలో కరెంట్ పోల్ షాక్ తగిలి ఓ వ్యక్తి చనిపోయాడు. తాజాగా బేగంపేట్‌లోనే ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. భారీ వర్షానికి ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.