India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD బాచుపల్లి PS పరిధి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు మృతిచెందగా నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా మృతులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన తిరుపతి(20), శంకర్(22), రాజు(25), ఖుషి, రామ్ యాదవ్(34), గీత (32), హిమాన్షు(4)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను జేసీబీల సహాయంతో వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు బాచుపల్లిలోని మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం గ్రామం లక్ష్మిపురంలో బుధవారం జరిగే ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు పూర్తి చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో వేములవాడ నుంచి ఉదయం 11.05 గంటలకు మోదీ బయలుదేరి 11.45 గంటలకు మామునూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.55 బహిరంగ సభ వేదిక పైకి వస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.50 గంటల వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
భవనంపై నుంచి కిందపడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. గ్రామస్థుల ప్రకారం.. మహమ్మదాబాద్ మండలం నంచర్లకు చెందిన శివకుమార్(16) MBNR పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. పరీక్షల అనంతరం హైదరాబాద్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మృతి చెందినట్లు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13వ తేదీన HYD బహదూర్‌పురలోని జూపార్కుకు సెలవు ప్రకటిస్తున్నట్లు క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్.హీరెమత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న జూపార్కు మూసి ఉంటుందని, మరుసటి రోజు యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో తెరిచి ఉంటుందన్నారు. సందర్శకులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

HYD రాయదుర్గంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)లో ఎంసీజే కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎంసీజే హెచ్‌ఓడీ ప్రొ.మహ్మద్ ఫరియాద్ తెలిపారు. ఎంసీజేలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్, డిజిటల్ మీడియా, వీడియో ప్రొడక్షన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ లేదా 9966058101 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల మద్దతు లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు. మంగళవారం HYD బషీర్‌బాగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఆ పార్టీని ఓడించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

భారతీయ జనతా పార్టీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఖానాపూర్‌కు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి ,రాష్ట్ర నాయకులు రితిష్ రాథోడ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక జంగల్ హనుమాన్ ఆలయం నుంచి ఖానాపూర్ బస్టాండ్ వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై ఆయన పర్యటనను జయప్రదం చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.