India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అప్పటినుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,557 కేసులు నమోదు చేసి, 683 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు. రూ. 8.89 కోట్ల విలువైన అక్రమ మద్యం, కల్లు, నాటుసారా, గంజాయి తదితర పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈమధ్య పటాన్ చెరులో రూ. 9.23 కోట్ల విలువచేసే ఎంఎంసీ మత్తు పదార్థం సీజ్ చేశామన్నారు
కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి హన్మకొండకు వచ్చారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా హన్మకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంత్రులు సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తదితరులున్నారు.
WGL- KMM- NLG పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా 6వ రోజు మంగళవారం 14 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్‌కి నామినేషన్లను సమర్పించారు.
వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనదారుడిపై చెట్టు కూలి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఇల్లంద గ్రామానికి చెందిన దయాకర్(22)గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన దయాకర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డికి వస్తున్న కేసీఆర్ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ టీ స్టాల్‌లో టీ తాగి పకోడి తిన్నారు.
దేశ గౌరవాన్ని అత్యున్నత స్థానంలో నిలిపిన ప్రధాని మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మ కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ లోక్ సభ ఎన్నికలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కి మద్దతుగా మంథని నియోజకవర్గంలో నిర్వహించిన జనసభకి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గోమాస శ్రీనివాస్‌ని పెద్దపల్లి ఎంపీగా, మోదీని మరోసారి దేశ ప్రధానిగా గెలిపించాలని కోరారు.
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అధికారులకు రాకేష్ రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తాతా మధు, జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
నారాయణపేటకు చెందిన నలుగురు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2, 12, 13, 15 వార్డుల కౌన్సిలర్లు అనిత సుభాశ్, వరలక్ష్మీ కార్తీక్, నారాయణమ్మ వెంకట్రాములు, రాజేశ్వరి శివరాంరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన కుకునూర్‌పల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కుకునూర్‌పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా.. కుకునూర్‌పల్లికి చెందిన కుమ్మరి మల్లేశం(33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పనుల నిమిత్తం వ్యవసాయం బావి దగ్గరకి వెళ్లాడు. అప్పుడే ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. ఈ క్రమంలో అతనిపై పిడుగుపడింది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతిచెందాడు.
Sorry, no posts matched your criteria.