Telangana

News April 11, 2024

హైదరాబాద్: BRS, కాంగ్రెస్, MIM ఒక్కటే: కిషన్ రెడ్డి

image

BRS, కాంగ్రెస్, MIM మూడు పార్టీలు ఒక్కటేనని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో‌ అధికారంలో ఉన్న BRSకు మద్దతు ఇచ్చిన MIM ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తోందని విమర్శించారు. ఫిరోజ్‌ఖాన్‌ మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. వీళ్లంతా కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఏంటని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో BJPకే అత్యధిక స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు.

News April 11, 2024

MBNR: సీఎం రేవంత్ పై డీకే అరుణ హాట్ కామెంట్స్

image

CM రేవంత్ రెడ్డిపై BJP ఎంపీ అభ్యర్థి DK అరుణ హాట్ కామెంట్స్ చేశారు. గురువారం జిల్లాలోని ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో MPగా ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ సాధనలో CM రేవంత్ రెడ్డి పాత్ర ఉందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సానుభూతి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

News April 11, 2024

UPDATE.. HNK: రోడ్డు ప్రమాదంలో 3 నెలల చిన్నారి మృతి

image

HNK జిల్లా ఆత్మకూరు మండలంలో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 నెలల చిన్నారి మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భువనగిరి జిల్లాకు చెందిన శ్రీకాంత్-స్రవంతి దంపతులతో పాటు వారి కూతురు.. ములుగు జిల్లా మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా గుడెప్పాడు వద్ద ఆగిఉన్న లారీని, కారు ఢీకొట్టింది. చిన్నారి అక్కడిక్కడే మృతి చెందిందగా తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి.

News April 11, 2024

MBNR: రైళ్లలో హిజ్రాలు వేధింపులు

image

MBNR రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ హిజ్రాలు ఇబ్బందులు పెడుతున్నారు. డబ్బులు ఇవ్వని వారిని అవహేళన చేయటం, తిట్టడం, వెకిలి చేష్టలతో అపహాస్యానికి దిగటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే పోలీసుల ఉదాసీన వైఖరివల్ల హిజ్రాలు రెచ్చిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. డివిజన్ అధికారులు వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News April 11, 2024

బండి సంజయ్ రూ.12వేల కోట్ల నిధులు తీసుకువచ్చారు: రాణి రుద్రమ

image

భారతదేశంలో అందరు ఎంపీల కంటే ప్రజా సమస్యలపై పోరాటం చేసిన బండి సంజయ్ పై అత్యధిక కేసులు ఉన్నాయని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమదేవి అన్నారు. గురువారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకున్న వ్యక్తి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి రూ.12 వేల కోట్ల నిధులు ఎంపీ బండి సంజయ్ తీసుకువచ్చారని తెలిపారు.

News April 11, 2024

హన్మకొండ: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

image

లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ క్రాస్ రోడ్ సమీపంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం.. హన్మకొండ వైపు నుంచి పరకాల వైపు వెళ్తున్న కారు.. గూడెప్పాడు వద్దకు రాగానే అదుపు తప్పి పక్కనే ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

MBNR: తగ్గిన జూరాల ప్రాజెక్ట్ నీటిమట్టం

image

కృష్ణాతీరంలోని ప్రధాన ప్రాజెక్టు జూరాల రిజర్వాయర్‌లో ఈసారి నీరు కూడా లేకుండా పూర్తిగా అడుగంటింది. ఈ సీజన్‌ మొదటి నుంచే కృష్ణాలో నీటి జాడ లేకపోవడంతో యాసంగిలో అధికారులు రైతులకు సాగునీరు అందించలేమని పంట విరామం (క్రాప్‌ హాలిడే) ప్రకటించారు. మొత్తం 9.657 టీఎంసీ సామర్థ్యం ఉన్న జూరాల రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.44 టీఎంసీ నీటికి పరిమితమైంది. ఈ నీటిని ఎలాంటి అవసరాలకు వినియోగించలేని పరిస్థితి నెలకొంది.

News April 11, 2024

ఉమ్మడి జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు

image

ఉమ్మడి జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో NLG, SRPT, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రధ్ధలతో ప్రార్ధనలు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

News April 11, 2024

భర్త ఆత్మహత్య మనోవేదనతో కుమారుడితో కలిసి భార్య బలవన్మరణం

image

కామేపల్లి మండలం గోవిందరాల గ్రామంలో ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. వ్యవసాయం చేస్తే లాభాలొస్తాయని అప్పులు తెచ్చిమరి సాగు చేస్తే చివరకు అప్పులే మిగిలాయి. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక 2నెలల క్రితం ఇంటి యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాళికట్టి అండగా నిలిచిన భర్త దూరం కావడంతో మనోవేదనకు గురైన అతడి భార్య తన కుమారుడితో కలిసి ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

News April 11, 2024

మెదక్: శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి

image

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ టేక్మాల్ మండలం దన్నూరా, బర్దిపూర్, పాల్వంచ, కూసంగి, మల్కాపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దుబ్బగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.