India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచార వాహనాలు వీధుల్లో తిరుగుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. మే 13న పోలింగ్ ఉన్నందున 48 గంటల ముందుగానే ప్రచారం ముగించాలి. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల వరకు మైకులు కట్టేయాలి. ఎన్నికల నిబంధనలు ఎవరైనా విస్మరిస్తే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోనుంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చాలా వరకు నోటా వైపు వెళ్లారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి మంది ఓటర్లు నోటాకు మద్దతు ఇచ్చారు. అత్యధికంగా అచ్చంపేట నియోజకవర్గంలో 2,833 మంది నోటాకు ఓటు వేశారు. అత్యల్పంగా కల్వకుర్తి నియోజకవర్గంలో 661 మంది నోటాకు ఓటు వేశారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ MLC స్వాతంత్ర్య అభ్యర్థిగా పాలకురి అశోక్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆయన రేపు నల్లగొండలో ఆయన నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన 3 జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. లైబ్రరీలు, కార్యాలయాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి మంచి స్పందన వస్తోందని, పట్టభద్రులు తనను గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అశోక్ పేర్కొన్నారు.
HYD సెంట్రల్ యూనివర్సిటీలో మినీ అబ్జర్వేటరీ అందుబాటులోకి వచ్చింది. నక్షత్రాలు, గ్రహాలను ఇక్కడి నుంచే టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ ఉస్మానియా ఆధ్వర్యంలో నిజం అబ్జర్వేటరీ, హైదరాబాద్ ఐఐటీలో మరో కేంద్రం అందుబాటులో ఉంది. దీని ద్వారా వాయు కాలుష్య తీవ్రతను సైతం అంచనా వేయొచ్చని, నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణాన్ని అధ్యయనం చేయొచ్చని ప్రొఫెసర్ ఉదయగిరి తెలిపారు.

HYD ప్రజలకు మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లాల్లో నేడు 40KMPH వేగంతో కూడిన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా నీరు నిలిచినా.. అత్యవసర పరిస్థితులు ఏర్పడినా 040-21111111, 9000113667 కాల్ చేసి తెలియజేయాలన్నారు.

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల MLC ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేయగా.. ఈరోజు CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. పట్టభద్రులు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడంలో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి యువ ఓటర్ల పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 29 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 45% పైగా 18-39 ఏళ్లు ఉన్న వారే కావడంతో తమకు అనుకూలంగా మళ్లించుకునే దిశగా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.15,70,000 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.7,57,711 విలువ గల ఇతర వస్తువులు, 127.58 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 11 మందిపై కేసులు నమోదు చేశామని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.