India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో అకాల వర్షాలు రైతన్నలకు అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా సాగుతున్న మామిడి, అరటి తోటల పై ఈదురుగాలుల ప్రభావం పడింది. జిల్లాలోని సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు ఎస్, పెన్పహాడ్, మద్దిరాల, నాగారం తదితర మండలాల్లో ఎక్కువగా మామిడి తోటలకు నష్టం చేకూరింది. మామిడికాయలు తెంపే సమయంలో ఈదురుగాలులు వీచడంతో కాయలు అధికంగా నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,332 కేసుల్లో రూ.9,39,42,041 కోట్ల నగదుతో సహా మొత్తం రూ.41,81,11,904 విలువ చేసే బంగారు ఆభరణాలు, మద్యం సీసాలు, డ్రగ్స్ సీజ్ చేశారు. వీటిలో 8652 గ్రాముల బంగారం, 48,900 గ్రాముల వెండి, 48,810 లీటర్ల మద్యం పట్టుబడింది. రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ దశకు చేరుకుంటున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న MBNR, NGKLపార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గెలుపునకు మాత్రం BJP, కాంగ్రెస్, BRS అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఈనెల11 వరకూ ప్రచారం ముగియనుండటంతో, ప్రచారంలో దూకుడుగా వెళుతున్నారు. ఇంటింటికి వెళుతూ ప్రతి ఓటరును కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
HYD అల్వాల్‌లో దారుణ హత్య ఘటన ఈరోజు వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అల్వాల్ పరిధి భారతినగర్‌లో అర్ధరాత్రి బావమరిది యుగంధర్‌ను బావ సుబ్రహ్మణ్యం బండరాయితో కొట్టి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న యుగంధర్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యం పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఫార్మసీ, బీపీఈడీ పరీక్ష ఫలితాలు విడదలయ్యాయని యూనివర్శిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ 1,2,7,8వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు, బీపీఈడీ 1, 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలు వెబ్‌సైట్ www.satavahana.ac.inలో అందుబాటులో ఉన్నాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎల్బీనగర్ ప్రాంతానికి ఏం చేయలేదని BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి రోడ్ షో ప్రోగ్రాంలో అన్నారు. కానీ.. కొడంగల్ ప్రాంతానికి రూ.3,500 కోట్లు కేటాయించారని, తెలంగాణలో కొడంగల్ ఒక్కటే ఉందా..? అని ప్రశ్నించారు. చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత టెంపుల్ నుంచి భవానీనగర్, విద్యుత్ నగర్, హనుమాన్ నగర్, ఇంద్రనగర్‌లో రోడ్ షో నిర్వహించారు.

కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలు, అవినీతిపై విచారణ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డకు రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన మేడిగడ్డ వద్దకు చేరుకోనున్నారు. భోజన విరామం అనంతరం గంటన్నర పాటు జస్టిస్ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.