India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటివరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో త్వరగా ఓటును వినియోగించుకోవాలి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేది ఉద్యోగులు, ఉపాధ్యాయులే అయినా.. చిన్న పొరపాట్ల కారణంగా తిరస్కరణకు గురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఉద్యోగుల ఓట్లు తిరస్కరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో యువ ఓటర్లు కీలకం కానున్నారు. మహబూబాబాద్, వరంగల్ లోక్‌సభ పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,22,871 మంది 18-39 ఏళ్ల వారే. మొత్తం ఓటర్లలో వీరి శాతం 48.34. కాగా మహబూబాబాద్ పరిధిలో 50.33%, వరంగల్‌లో 46.67% మంది ఆ వయస్సు ఉన్న ఓటర్లు ఉన్నారు. దీంతో యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎంపీ అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని జమ చేయడం ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ఈ నెల 9వ తేదీలోగా రైతుబంధును పూర్తిస్థాయిలో చెల్లిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి 9గంటల లోపు 15 ఎకరాల లోపు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు సమాచారం. జిల్లాలో మొత్తం 5,15, 354 మందికి రూ 609.35 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉన్నది.
ఖమ్మం MPగా BRS తరుపున పోటీ చేస్తున్న నామా నాగేశ్వర రావు ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారు? అని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క సీట్ కూడా గెలవని BRS నుంచి నామా ఎలా మంత్రి అవుతారని KCRను నిలదీశారు. ఖమ్మంలో ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత BRSకు రాష్ట్రంలో అడ్రస్ ఉండదన్నారు. కార్ షెడ్ నుంచి ఇక బయటకు రాదని విమర్శించారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం రాత్రి మెదక్ పట్టణానికి చేరుకోనుంది. కామారెడ్డి జిల్లా నుంచి రాత్రి 8 గంటలకు బస్సుయాత్ర మెదక్ పట్టణంలోకి ప్రవేశిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక రాందాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. బుధవారం నర్సాపూర్‌లో బస్సుయాత్ర కొనసాగనుంది.
కరీంనగర్ తీగల వంతెనపై నుంచి కిందికి దూకి గుర్తు తెలియని వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిస్తే కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి 7:50 గంటల మధ్య ప్రధాని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. బుధవారం ఉదయం 8:35 నుంచి 9:10 గంటలకు ఇదే మార్గంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ సమయాల్లో ఈ మార్గంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆటో డ్రైవర్లను మోసం చేశారని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. HYD శంషాబాద్‌లో సోమవారం భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా గెలవగానే ఆటో డ్రైవర్లను ఆదుకుంటానని, ఆటో డ్రైవర్లకు బ్యాంకు రుణాలతో పాటు ఆవాస్ యోజన పథకం కింద సొంతింటి కల సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.

Sorry, no posts matched your criteria.