India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేషనల్ స్కిల్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మణికొండలోని సమస్త కార్యాలయంలో ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.
SHARE IT
వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. డీఆర్డీఓ, డీపీఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది గ్రామాల్లో సర్వేలు నిర్వహించాలని మంత్రి సీతక్క కోరారు.
కష్టపడి పని చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేయండని, పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూసి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సిపి, ఎస్పీలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని, ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.
మహిళా సమాఖ్య, రైతులు, స్థానిక ప్రజల సమస్యలపై మంత్రి జూపల్లి చర్చించారు. వీపనగండ్ల మండలంలోని వివిధ అంశాలపై అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అవినీతికి తావు లేదనే సందేశం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వెళ్లాలన్నారు.
జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం లో తెలిపారు. వరదల వల్ల నష్టం జరగకుండా అధికారులు మందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు అందుబాటులో ఉండాలని చెప్పారు. చెరువు కట్టలు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్ల ముందు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు బిక్కనూర్ మండలంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలో నిర్వహించే రైతు సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.
నేషనల్ స్కిల్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మణికొండలోని సమస్త కార్యాలయంలో ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. SHARE IT
ADB జిల్లా వ్యాప్తంగా 18 మంది ధరణి అపరేటర్లకు స్థానచలనం కల్పించారు. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను ఎట్టకేలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో చేరాలని ఆదేశించారు. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కొందరిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తారని అంతా భావించినా.. పక్క మండలానికే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల 21, 22న జరగనున్న విషయం తెలిసిందే. అమ్మవారి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి TGRTC ప్రత్యేక రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రేటర్‌లోని 24 ప్రాంతాల నుంచి 175 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ MD సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT
Sorry, no posts matched your criteria.