Telangana

News March 17, 2024

HYD: యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకుని హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి PS పరిధిలో జరిగింది.SI శోభన్ వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ (29) గచ్చిబౌలిలోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని 11 నెలలుగా శ్రీ దుర్గమెన్స్ పీజీ హాస్టల్ నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నాడు. కాగా శనివారం అతడు  ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

News March 17, 2024

లోక్ సభ పోరు.. NGKL కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

image

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మహబూబ్ నగర్ పరిధిలో BRS, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. అటూ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి తేలాల్సి ఉంది. ఇక్కడ BRS, కాంగ్రెస్‌ అభ్యర్థులపై స్పష్టత వస్తే ప్రచారం ఊపందుకోనుంది.

News March 17, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. ఈరోజు ఉ. 8:30 గంటల వరకు గడచిన 24 గంటల్లో ఏడబ్ల్యూఎస్ స్టేషన్లలో నమోదైన వర్షపాతం వివరాలు.. చిన్న శంకరంపేట 37.5 మిల్లీమీటర్లు, చేగుంట 34.8, దౌల్తాబాద్ 31.0, తుక్కాపూర్ 26.3, మాసాయిపేట 22.0, ఝరాసంఘం 21.8, నారాయణరావుపేట 20.0, కొల్చారం 19.0, కౌడిపల్లి 15.5, సత్వార్ 14.8, శనిగరం 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News March 17, 2024

ముందుగానే కేంద్రాలకు చేరుకోండి : డీఈఓ

image

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు ముందు రోజే కేంద్రాలను సరిచూసుకుంటే మంచిదని సూచించారు. అలాగే, పరీక్ష రోజు కేంద్రాలకు హాల్ టికెట్లతో నిర్ణీత సమయానికి కంటే ముందుగా చేరుకోవాలని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని, అవాంచనీయ ఘటనలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

News March 17, 2024

భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో?

image

BRS తరఫున నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే కేసీఆర్‌ రెండు నియోజకవర్గాల్లోని సీనియర్‌ నేతలతో పలుమార్లు చర్చించినా.. అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోలేదు. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి వైపు అధిష్ఠానం దృష్టి సారించినట్లు సమాచారం. భువనగిరి నుంచి జిట్టా బాలక్రిష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు, బూడిద బిక్షమయ్యగౌడ్‌ పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు.

News March 17, 2024

సంగారెడ్డి: ప్రజావాణి రద్దు

image

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా కలెక్టరేటో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు
సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, ఎన్నికల తర్వాత యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని చెప్పారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మెదక్, సిద్దిపేట అధికారులు కోరారు.

News March 17, 2024

HYD: చిక్కడపల్లిలో వ్యక్తి దారుణ హత్య

image

HYD చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. శనివారం అర్ధరాత్రి ప్రధాన రహదారి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న 67 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

మెదక్ ఎంపీ స్థానంపై వీడని పీటముడి

image

మెదక్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో పీటముడి వీడటం లేదు. టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్‌పై సైతం ఆశలు పెట్టుకున్నారు. అక్కడ ఇవ్వకుంటే మెదక్‌ టికెట్‌ అయినా ఖరారు చేయాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. పటాన్‌చెరుకు చెందిన నీలం మధు, మైనంపల్లి టికెట్ పోటీలో ఉండగా అధిష్ఠానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో చూడాలి.

News March 17, 2024

HYD: చిక్కడపల్లిలో వ్యక్తి దారుణ హత్య

image

HYD చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. శనివారం అర్ధరాత్రి ప్రధాన రహదారి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న 67 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

సిద్దిపేట: నోడల్ అధికారులకు శిక్షణ: కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల నోడల్ అధికారులుగా నియామకమైన వారికి శిక్షణ ఇస్తున్నట్టు కలెక్టర్ ఎన్నికల అధికారి మను చౌదరి తెలిపారు. విలేకరులతో మాట్లాడారు. మెదక్ లోక్ సభ పరిధిలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని, కరీంనగర్ లోక్సభ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గం భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో జనగామ శాసనసభ పరిధికి సంబంధించి జిల్లాలోని నాలుగు మండలాలు ఉన్నాయన్నారు.