Telangana

News May 6, 2024

సిద్దిపేట: వాహనాల తనిఖీల్లో రూ.14,62,000 పట్టివేత

image

సిద్దిపేట వన్ టౌన్ సిఐ లక్ష్మీబాబు తన సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆకస్మిక వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టణానికి చెందిన యం.రమేష్ తన మోటార్ సైకిల్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళుతున్న రూ.8,62,000/- సీజ్ చేశారు. చౌడారం గ్రామానికి చెందిన రాములు తన వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.6 లక్షలు తీసుకువెళ్తుండగా వాటిని సీజ్ చేసినట్లు సీఐ లక్ష్మీబాబు తెలిపారు.

News May 6, 2024

కామారెడ్డి: ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు కామారెడ్డి ద్వితియ శ్రేణి మెజిస్ట్రేట్ ప్రతాప్ తీర్పునిచ్చారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మహమ్మద్ యూనిస్, కోన గణేశ్ పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచనట్లు పోలీసులు తెలిపారు. వారికి న్యాయస్థానం 2రోజుల జైలు శిక్షతో పాటు రూ.200 చొప్పున జరిమానా విధించింది.

News May 6, 2024

NGKL: వైద్యం వికటించి.. ఓ వ్యక్తి మృతి

image

వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన NGKL జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గౌరారం గ్రామానికి చెందిన చిన్న రాములు (38) అనారోగ్యం కావడంతో తెలకపల్లిలో ఓ ప్రైవేటు వైద్యుడి దగ్గరికి వెళ్లాడు. ఆ వైద్యుడు టైఫాయిడ్ వచ్చిందని ఇంజక్షన్ ఇచ్చి, సెలైన్ పెట్టాడు. ఆ వైద్యం వికటించి మరణించాడు. వైద్యుడిపై కఠినచర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.

News May 6, 2024

హైదరాబాద్‌లో విషాదం.. పోతరాజు దినేశ్ మృతి

image

బోనాల పండుగకు 2 నెలల ముంగిట HYDలో విషాదం నెలకొంది. లష్కర్‌లోనే ఫేమస్ పోతరాజు‌ చనిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న దినేశ్ ఆదివారం రాత్రి కన్నుమూసినట్లు‌ తెలిసింది. సికింద్రాబాద్‌ కుమ్మరిగూడ‌‌‌లో ఉండే ఈ పోతరాజు 15 ఏళ్ల నుంచి‌ ఉజ్జయిని టెంపుల్‌ వద్ద‌ గంభీరమైన ఆకారంతో‌ భక్తులకు కనిపించేవారు. ఎన్నో ఏళ్లు‌గా వేషం‌ వేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించారు. దినేశ్ మరణం పట్ల‌ పలువురు సంతాపం తెలిపారు.

News May 6, 2024

హైదరాబాద్‌లో విషాదం.. పోతరాజు దినేశ్ మృతి

image

బోనాల పండుగకు 2 నెలల ముంగిట HYDలో విషాదం నెలకొంది. లష్కర్‌లోనే ఫేమస్ పోతరాజు‌ చనిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న దినేశ్ ఆదివారం రాత్రి కన్నుమూసినట్లు‌ తెలిసింది. సికింద్రాబాద్‌ కుమ్మరిగూడ‌‌‌లో ఉండే ఈ పోతరాజు 15 ఏళ్ల నుంచి‌ ఉజ్జయిని టెంపుల్‌ వద్ద‌ గంభీరమైన ఆకారంతో‌ భక్తులకు కనిపించేవారు. ఎన్నో ఏళ్లు‌గా వేషం‌ వేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించారు. దినేశ్ మరణం పట్ల‌ పలువురు సంతాపం తెలిపారు.

News May 6, 2024

WGL: పురుగు మందు తాగిన తండ్రి మృతి

image

HNK జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురానికి చెందిన కుమారస్వామి, అతని కూతురు శ్రీవిద్య పురుగు మందు తాగి <<13193945>>ఆత్మహత్యాయత్నానికి<<>> పాల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. కూతురు చదువు విషయమై ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశంలో పురుగు మందు సేవించిన తండ్రి మృతి చెందాడు. కూతురి పరిస్థితి విషమం కావడంతో పరకాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

ఖమ్మం: అమాంతం పెరిగిన చికెన్ రేటు

image

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. వేసవి ఎండ ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఎక్కువయ్యాయి. కిలో చికెన్ రూ.280కి విక్రయిస్తున్నారు. ఈ ప్రభావం నాటు కోడి మాంసంపైనా పడింది. గత వారం వరకు రూ.450 ఉన్న నాటు కోడి మాంసం ఈ వారం రూ.500లకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలో సాధారణ రోజుల్లో 40 టన్నులు, పెళ్లిళ్ల సీజన్లో 50 టన్నుల వరకు కోడిమాంసం వినియోగం ఉంటోంది. ఆదివారమైతే అది 120 టన్నులు అవుతోంది.

News May 6, 2024

నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు పడిపోతున్నాయి. సోమవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 123.1741 టీఎంసీలకు చేరింది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ కాగా.. అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉంది.

News May 6, 2024

ఎర్రవల్లి: వాహనం ఢీకొని మహిళ మృతి

image

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవలిలోని 44వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ రహదారి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిందని వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

నేను పక్కా లోకల్ అభ్యర్థిని: సుధీర్ కుమార్

image

నేను పక్కా లోకల్ అభ్యర్థినని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్‌కు వస్తున్న ఆదరణను చూడలేకనే, నేను నాన్ లోకల్ అంటూ కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని సుధీర్ కుమార్ మండిపడ్డారు.