Telangana

News July 19, 2024

తల్లిని హత్య చేసిన కొడుకు రిమాండ్

image

కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని ఇటీవల తల్లి సక్రిని కర్రతో కొట్టి హత్య చేసిన కుమారుడు భీముడు ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై రాజారాం తెలిపారు. ఈనెల 15న కన్నతల్లి అయిన సక్రిని గుగులోత్ భీముడు కర్రతో కొట్టి హత్య చేశాడు. విచారణలో తల్లిని చంపిన వ్యక్తి బీముడు ను అదుపులో తీసుకొని రిమాండ్ చేసినట్లు ఎస్ఐ చెప్పారు.

News July 19, 2024

ALP: పూజ సామాగ్రి సరఫరాకు సీల్డ్ టెండర్లు

image

అలంపూర్ ఆలయాలకు పూజ, కిరాణా తదితర సామాగ్రి ఏడాది పాటు సరఫరా చేసేందుకు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో సీల్డ్ టెండర్లు జరిగాయి. ఇందులో వివిధ ప్రాంతాల ఏజెన్సీలు పాల్గొని టెండర్లు దక్కించుకున్నాయి. కరపత్రాల ప్రింటింగ్, లడ్డు, పులిహోర కవర్లు, క్యారీ బ్యాగులు ప్రైవేట్ సెక్యూరిటీకి టెండర్లు నిర్వహించగా MBNR, HYD ప్రాంతాల ఏజెన్సీలు దక్కించుకున్నాయని మహబూబ్ నగర్ దేవాదాయశాఖ సహాయ కమీషనర్ శ్రీనివాసరాజు తెలిపారు.

News July 19, 2024

ADB: పోలీస్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంను ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుళ్లకు వడ్డించే ఆహారాన్ని స్వయంగా తిని పరిశీలించి వంటలు నిర్వహించే వారికి సూచనలు చేశారు. ఆహారాన్ని నాణ్యతతో కూడిన వస్తువులతో వండాలని సూచించారు. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు శిక్షణ కాలంలో క్రమం తప్పకుండ హాజరవ్వాలని అన్నారు.

News July 19, 2024

మునగాల: విధుల పట్ల నిర్లక్ష్యం తగదు : కలెక్టర్‌

image

మునగాల పి.హెచ్. సి. ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేసారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మునగాల పి.హెచ్.సి.కి వెళ్లగా ఆ సమయానికి మెడికల్ అఫీసర్, సిబ్బంది లేకపోవటం వల్ల కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్‌ని, మెడికల్ స్టోర్‌ని పరిశీలించారు. అలాగే పి.హెచ్.సి.ని పరిశీలించగా పరిశుభ్రంగా లేకపోవటం పట్ల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.

News July 19, 2024

మెదక్ కలెక్టర్‌కు అభినందనల వెల్లువ

image

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీలో పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ద్వారా భారతీయ పాలన, ప్రజా విధానం అంశంపై బంగ్లాదేశ్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్స్, కలెక్టర్లకు అవగాహన కల్పించారు. దేశంలో సుపరిపాలనపై చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను పవర్ పాయింట్ ద్వారా తెలిపారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఇతర దేశస్తులు రాహుల్ రాజ్‌ను అభినందించారు.

News July 19, 2024

జోనల్ 4 పంచాయతీ కార్యదర్శుల బదిలీలు ప్రక్రియ పూర్తి

image

జోన్ 4 పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల పంచాయతీ కార్యదర్శుల బదిలీ లో ఈరోజు పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్ కమీషనర్ కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు 10 మంది, మహబూబాబాద్ జిల్లాకు ఒకరు బదిలీపై వెళ్తున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ లో ఎవరు రావడం లేదని అధికారులు తెలియజేసారు.

News July 19, 2024

ఉపాద్యాయుల సమయపాలన పాటించాలి: విద్యాశాఖ డైరెక్టర్

image

ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ నరసింహరెడ్డి అన్నారు. శుక్రవారం మాగనూర్ మండలం మందిపల్లిలో పాఠశాలను అదనపు కలెక్టర్ మయంక్ మిట్టల్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. 180 మంది విద్యార్థులకు కేవలం ఒక్కరే టీచర్ ఉన్నారని దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

News July 19, 2024

డిప్యూటీ సీఎంను కలిసిన మంత్రి, ఎంపీ

image

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ములుగు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై డిప్యూటీ సీఎంతో మంత్రి సీతక్క చర్చించారు. ములుగు సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News July 19, 2024

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు 2 రోజుల సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

News July 19, 2024

తూప్రాన్‌: ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చికిత్స

image

తూప్రాన్‌లో ఓ హోటల్లో భోజనం చేసిన పలువురు తీవ్ర అస్వస్థత గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు.. నూతన వెరైటీలతో పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ హోటల్లో మంగళ, బుధవారాల్లో పలువురు బిర్యానీ తిన్నారు. ఒక్కొక్కరుగా 15 మందికిపైగా అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొదట నార్మల్‌గా తీసుకున్న వారు హోటల్ ఫుడ్‌ పాయిజన్ కావడంతో ఆందోళన చెందారు.