India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీ వేములవాడ పర్యటన నేపథ్యంలో నేటి నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటు వేములవాడ పట్టణ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డ్రోన్లు వినియోగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సూర్యాపేట జిల్లాలో విషాదం జరిగింది. కోదాడలోని ఓ గోల్డ్ లోన్ సంస్థ భవనం పైనుంచి ఓ యువకుడు దూకాడు. గోల్డ్ లోన్ నిర్వాహకులు వేధిస్తుండడంతో దూకినట్లు బాధితుడు ఆరోపించాడు. క్షతగాత్రుడిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
HYD నగరంలో రోజురోజుకు పట్టణీకరణ పెరుగుతోంది. అర్బన్ ల్యాబ్స్ రీసెర్చ్ మార్చ్-2024 ప్రకారంగా అర్బన్ హీట్ ఐలాండ్ జోన్ల వివరాలను అధికారులు తెలిపారు. పటాన్‌చెరు, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌పల్లి, బీఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్, మన్సూరాబాద్ ప్రాంతాలు హీట్ జోన్లుగా పేర్కొన్నారు. మరోవైపు రోజు రోజుకు GHMC పరిధిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి నాలుగవ రోజు సోమవారం DSP(ధర్మ సమాజ్ పార్టీ) అభ్యర్థిగా (1) బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్
(1) సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, రెవిన్యూ అదనపు ములుగు జిల్లా కలెక్టర్ సిహెచ్. మహేందర్ జీకి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
పెట్టుబడులకు భారీ లాభాలు అంటూ మోసాలకు పాల్పడ్డ ఆరుగురు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులపై దేశ వ్యాప్తంగా 600 కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో నమోదైన 77 కేసుల మిస్టరీ వీడిందని తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న 3.12 కోట్లు జప్తు చేశామని, దేశ వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే, మంత్రి ప్రచారాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఏర్పాటు చేసిన జన జాతర సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఖమ్మం: సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్న పేదింటి ప్రజలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు చేస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్క అర్హులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంటులో ఇప్పటి వరకు జరిగిన 17 ఎన్నికల్లో 8 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 1957లో వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వర్‌రావు ఎంపీగా గెలిచారు. తిరిగి 1967, 71, 77లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1980లో మల్లికార్జున్ గెలుపొందగా, తిరిగి 1989, 91, 96లో వరుసగా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఈ ఇద్దరు ఎంపీలుగా 4 సార్లు ఎన్నిక కాగా వరుసగా 3సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
Sorry, no posts matched your criteria.