Telangana

News September 7, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో ఈ మండలాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా!

image

ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల సంఖ్య 2011లో 7,78,184 ఉండగా ఇప్పుడు 10 లక్షలు దాటింది. GDWLలో కేటీదొడ్డి, గట్టు, ధరూర్, NRPTలోని దామరగిద్ద, మద్దూరు, కోస్గి, NGKLలోని బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, మన్ననూరు, అమ్రాబాద్, పదర, WNPTలో ఖిల్లాఘణపూర్, పెద్దమందడి, MBNRలో కోయిలకొండ, గండీడ్, బాలన గర్ మండలాల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రత్యేక కథనం.

News September 7, 2024

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

image

వినాయక చవితి పండుగ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని డిప్యూటీ సీఎం అన్నారు.

News September 7, 2024

26 నుంచి MGU MED, BED సెమిస్టర్ పరీక్షలు

image

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఎంఈడి, బీఈడీ కళాశాలలో చదివే విద్యార్థులకు సెమిస్టర్ 2 రెగ్యులర్ పరీక్షలను ఈనెల 26 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించనున్నట్లు సిఓఈ ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల షెడ్యూళ్లను ఆయన విడుదల చేశారు. వర్సిటీ వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

News September 7, 2024

ఖమ్మం: రూ.3.43 కోట్లకు వ్యాపారి ఐపీ

image

ఖమ్మం బ్యాంకు కాలనీకి చెందిన పురుగుమందుల వ్యాపారి నూతలపాటి రవి స్థానిక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో రూ.3.43 కోట్లకు శుక్రవారం ఐపీ దాఖలు చేశారు. 32 మంది రెండు దాతలను ప్రతివాదులుగా చేర్చారు. కామేపల్లి మండలం పెంజరమడుగుకు చెందిన పిటిషనర్ పండితాపురంలో పురుగుమందులు, విత్తనాల వ్యాపారం నిర్వహించాడు. వ్యాపార నిమిత్తం తెచ్చిన అప్పులు తీర్చలేక ఐపీ దాఖలు చేశారు.

News September 7, 2024

వరంగల్: నేరస్తులపై రౌడీషీట్లు తెరుస్తున్న పోలీసులు

image

పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. వరంగల్ నగరంలో నేరాలను నియంత్రించేందుకు పోలీస్ కమిషనరేట్ పోలీసులు నేరస్తులపై ఉక్కు పాదం మోపుతున్నారు. పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. 8 నెలల కాలంలో 36 మందిపై రౌడీ షీట్స్, 73 మందిపై సస్పెక్టెడ్ షీట్స్ తెరిచారు.

News September 7, 2024

HYD: గణేశ్ నిమజ్జనానికి 73 పాండ్స్

image

గణేశ్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌‌లో విగ్రహ నిమజ్జనం చేయడానికి ప్రజలకు అందుబాటులో 73 లొకేషన్లలో వివిధ రకాల పాండ్ ‌లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసినట్లు కమిషనర్ అమ్రపాలి తెలిపారు. నగర వ్యాప్తంగా 73 పాండ్ ‌లలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్, 22 ఎస్కలేటర్ పాండ్స్ ఏర్పాటు చేశామన్నారు. అందులో పెద్ద విగ్రహాలు కాకుండా 2 నుంచి 5 ఫీట్ల చిన్న విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలుగా ఏర్పాటు చేశామన్నారు.

News September 7, 2024

HYD: గణేశ్ నిమజ్జనానికి 73 పాండ్స్

image

గణేశ్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌‌లో విగ్రహ నిమజ్జనం చేయడానికి ప్రజలకు అందుబాటులో 73 లొకేషన్లలో వివిధ రకాల పాండ్ ‌లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసినట్లు కమిషనర్ అమ్రపాలి తెలిపారు. నగర వ్యాప్తంగా 73 పాండ్ ‌లలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్, 22 ఎస్కలేటర్ పాండ్స్ ఏర్పాటు చేశామన్నారు. అందులో పెద్ద విగ్రహాలు కాకుండా 2 నుంచి 5 ఫీట్ల చిన్న విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలుగా ఏర్పాటు చేశామన్నారు.

News September 7, 2024

మహబూబ్‌నగర్: భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం

image

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్లు జలమయం అయ్యాయి. తాండూర్-మహబూబ్‌నగర్ రోడ్డుపై రాకపోకలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన కల్వర్టులపై నుంచి వరద నీరు ప్రవహించింది. శుక్రవారం రాకపోకలు అగిపోయాయి.

News September 7, 2024

నిజామాబాద్ అంతా NIGHT OUT

image

వినాయక చవితి నేపథ్యంలో ఉమ్మజి నిజామాబాద్ యువత నైట్ అవుట్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఏ వీధిలో చూసినా యువకులు మండపాలు వేయడం, డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక విగ్రహాల కొనుగోలు చేసేందుకు కామారెడ్డి, నిజామాబాద్‌కు పోటెత్తారు. మరోవైపు పలు చోట్ల పండుగ సామగ్రి విక్రయ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండటంతో సందడి నెలకొంది. వినాయక చవితి తమకు స్పెషల్ ఫెస్టివల్ అని యువకులు తెలిపారు.

News September 7, 2024

గోదావరిఖని: ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల మూసివేత

image

ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను అధికారులు శుక్రవారం మూసివేశారు. నాలుగు రోజులుగా 32 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిన అధికారులు.. శుక్రవారం ఉదయం 12గేట్ల ద్వారా 64వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మధ్యాహ్నానికి 2 గేట్లు మాత్రమే తెరిచి నీటిని విడుదల చేశారు. సాయంత్రం పూర్తిగా గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 19.147 టీఎంసీల నీరు ఉంది.