India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని హత్య చేసిన ఘటన HYD జూబ్లీహిల్స్ పీఎస్ పరిధి యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ కింద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తుతెలియని వారొచ్చి మెట్రోస్టేషన్ వద్ద ఉన్న యువకుడిపై దాడి చేసి హత్య చేశారు. దుండగుల వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే పార్కింగ్ విషయమై హత్య జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి భారీగా తరలివచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పత్తి ధర పడిపోయింది. శుక్రవారం రూ.6,840 పలికిన క్వింటా పత్తి .. ఈరోజు రూ.6,725కి పడిపోయింది. ధరలు దారుణంగా పడిపోతుండడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు మరో వారమే సమయం ఉండడంతో రాజధానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే అమిత్‌షా, రేవంత్ రెడ్డి ప్రచారం చేయగా ఈనెల 9న సరూర్‌నగర్‌లో రాహుల్ గాంధీ సభ ఉండనుంది. 10న ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే రానున్నారు. అదే రోజు LB స్టేడియంలో పీఎం మోదీ సభ ఉంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, అన్నామలై ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక ఈనెల 11న KCR భారీ బహిరంగ సభ ఉండనుందని BRS శ్రేణులు తెలిపాయి.
లోక్‌సభ ఎన్నికలకు మరో వారమే సమయం ఉండడంతో రాజధానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే అమిత్‌షా, రేవంత్ రెడ్డి ప్రచారం చేయగా ఈనెల 9న సరూర్‌నగర్‌లో రాహుల్ గాంధీ సభ ఉండనుంది. 10న ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే రానున్నారు. అదే రోజు LB స్టేడియంలో పీఎం మోదీ సభ ఉంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, అన్నామలై ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక ఈనెల 11న KCR భారీ బహిరంగ సభ ఉండనుందని BRS శ్రేణులు తెలిపాయి.
ఈ నెల 7 నుంచి 14 వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు వర్ష సూచన, ఎండ తీవ్రత దృష్ట్యా హమాలీ కార్మికుల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని 8 రోజులపాటు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి యథావిధిగా మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.
ఓ చిరుత పులి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నందిపాడు- చింతలకుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలం వద్ద చిరుత పులి కళేబరం కనిపించింది. గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత రెండు రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని, వైద్య పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని 75 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ విధానంలో నేటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇవి పూర్తయిన తర్వాత జూలై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. దరఖాస్తులు, వెబ్ ఆప్షన్స్, సీట్ల కేటాయింపు ఆన్లైన్లోనే ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అన్ని డిగ్రీ కళాశాలలో కలిపి 26,040 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల వివరాలు
✓ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు – 23
✓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు – 57
✓ ఎస్సీ డిగ్రీ కళాశాలలు – 3
✓ ఎస్టీ డిగ్రీ కళాశాలలు – 3
✓ బీసీ డిగ్రీ కళాశాలలు – 4
✓ స్వయం ప్రతిపత్తి – 1
✓ మొత్తం డిగ్రీ కళాశాలలు – 91 ఉన్నాయి.
ఇందులో ప్రవేశాలకు నేటి నుంచి ఈనెల 25 వరకు మొదటి విడత “దోస్త్” రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం అయ్యాయి.
వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా ముగిసినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంజుల దేవి ప్రకటనలో తెలిపారు. మొత్తం 5,205 మంది విద్యార్థులకు గాను 5,087 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని గురుడుపేట్‌లో భీమ్‌రావు(30)అనే వ్యక్తి మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.