India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TGలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలు రాజధాని పరిధిలోనే ఉండడం గమనార్హం. 37,80,453 మంది ఓటర్లతో మల్కాజిగిరి ఫస్ట్ ఉండగా 29,39,057మంది ఓటర్లతో చేవెళ్ల సెకెండ్ ప్లేస్‌లో ఉంది. ఇక 22,17,305మంది ఓటర్లతో HYD థర్డ్, 21,20,550 మంది ఓటర్లతో సికింద్రాబాద్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాయి. కాగా రాష్ట్రమంతా మహిళా ఓటర్లు ఎక్కువుంటే ఈ నాలుగింటిలో మాత్రం పురుషులు ఎక్కువున్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. పత్తి జండా పాట క్వింటా రూ.7,150, నాన్ ఎసీ మిర్చి ధర క్వింటా రూ.18,000, ఏసీ మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలికినట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజులుగా రూ.50 నుంచి 300 వరకు హెచ్చుతగ్గుల మధ్య ధర కొనసాగుతోంది. ఏసీ మిర్చికి స్వల్పంగా ధర పెరుగుతోంది.
కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న మూడు సంవత్సరాల అన్విత్ అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BRS ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా నేడు చేవెళ్ల పరిధిలో KTR రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు. ఇప్పటికే KCR బహిరంగ సభ నిర్వహించారు. కాగా 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019లో రంజిత్ రెడ్డి BRS నుంచి గెలిచారు. ఇప్పుడు వారిద్దరూ BRS అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి చేవెళ్లలో BRS హ్యాట్రిక్ కొడుతుందా?

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటు కారేపల్లిలో 14.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఖమ్మం ఖానాపురం వద్ద 13 మి.మీ., కామేపల్లి మండలం లింగాల 8, ఖమ్మం ప్రకాష్ నగర్ 7, రఘునాథపాలెం, పమ్మిలో 4.8, పంగిడిలో 4.5, నేలకొండపల్లిలో 3.5, నాగులవంచలో 2.8, చింతకానిలో 2.3, కొణిజర్లలో 1.5, ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ 0.8, బాణాపురం, బచ్చోడులలో 0.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో వాతవరణం చల్లబడింది.
గుండెపోటుతో యువతి మృతిచెందిన ఘటన కలకోటలో శనివారం రాత్రి జరిగింది. కలకోటకి చెందిన మౌనిక(27) ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసి అవనిగడ్డలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. అనారోగ్యానికి గురవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు.
ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్య తగ్గిపోతుంది. లోక్ సభ స్థానానికి ప్రధాన పార్టీల తరఫున మహిళా అభ్యర్థులే లేరు. ఓటర్ల పరంగా దాదాపు 51 శాతం ఉన్న మహిళలు పోటీపరంగా మాత్రం ప్రాధాన్యం తగ్గడం గమనార్హం. NLG స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగినా.. ప్రధాన పార్టీలు వారిని పోటీకి దింపలేదు. ప్రస్తుత ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ నుంచి ఒకే ఒక మహిళ పోటీ చేస్తున్నారు.
పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో 2014లో జరిగిన పోలింగ్ కంటే 2019లో కాస్త పోలింగ్ శాతం తగ్గింది. 2014లో జరిగిన ఎన్నికల్లో 71.93 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల నాటికి అది కాస్తా 65.59 శాతంకు తగ్గింది. ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటు వినియోగించుకునేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎంత ప్రచారం చేసిన పెద్దగా ఫలితం ఉండడం లేదు.
Sorry, no posts matched your criteria.