Telangana

News July 21, 2024

ఫోన్ చేసి ఆధార్ నంబర్ చెప్పాలి: DAO శ్రవణ్‌కుమార్‌

image

పంట రుణమాఫీ పథకం అమలుకు సంబంధించి నల్గొండ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసినట్లు DAO శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. కాల్‌ సెంటర్‌ నంబర్‌ 7288800023కి ఫోన్‌ చేయడం ద్వారా రైతులు తమ సమస్యలకు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. ఫోన్‌ చేసేటప్పుడు ఆధార్‌ నంబర్‌ తెలపాలన్నారు. మండల స్ధాయిలో ఏవోకు ఫోన్‌ ద్వారా, స్వయంగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందాలన్నారు.

News July 21, 2024

నిజామాబాద్: బాలుడి కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరి

image

GGHలో శనివారం మూడేళ్ల బాలుడు<<13667747>> కిడ్నాప్<<>> అయిన విషయం తెలిసిందే. ఆ కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 6 బృందాలుగా విడిపోయి గాలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు ఆర్మూర్ మీదుగా కరీంనగర్ వైపు వెళ్లినట్లు గుర్తించి మెట్‌పల్లి వద్ద సా.4గంటలకు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన చెల్లికి పిల్లలు లేకపోవడంతో తన స్నేహితుడితో కలిసి ఈ కిడ్నాప్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

News July 21, 2024

అలా జరిగితే ఉప ఎన్నికలు: మంత్రి తుమ్మల

image

ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. వారు ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రయోజనం ఉండదని చెప్పారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తిస్తే మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.

News July 21, 2024

MBNR: రైతుబీమాకు దరఖాస్తు చేసుకోండి

image

రైతుబీమా కోసం 2024 జున్ 28 నాటికి రిజిస్ట్రేషన్ అయిన వారి జాబితా ధరణి పోర్టల్ నుంచి వ్యవసాయశాఖకు అందిందిన DAO వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18-59 సం.లు ఉన్న వారు ఆగస్టు 4లోపు క్లస్టర్ వ్యకసాయ విస్తరణ అధికారిని కలిసి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతుబీమా దరఖాస్తు ఫారానికి పట్టా పాస్‌బుక్, ఆధార్, నామినీ ఆధార్ జిరాక్స్ కాపీలతో రైతులు AEDOను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News July 21, 2024

HYD: ఉజ్జయిని మహంకాళి అరుదైన ఫొటో

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి‌ అమ్మవారి ఆషాఢమాస బోనాలు‌ అంగరంగ వైభవంగా‌ జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము‌ నుంచే మహిళలు‌ బోనాలతో‌ ఆలయానికి చేరుకుంటున్నారు. తల్లి దర్శనం కోసం సాధారణ భక్తులు క్యూ కట్టారు. మోండా మార్కెట్‌ నుంచి‌ మహంకాళి‌ టెంపుల్‌ వరకు అంతా సందడి‌గా మారింది. ఇటువంటి పర్వదినం రోజున 1850 నాటి అమ్మవారి అరుదైన ఫొటో‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.

News July 21, 2024

HYD: ఉజ్జయిని మహంకాళి అరుదైన ఫొటో

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి‌ అమ్మవారి ఆషాఢమాస బోనాలు‌ అంగరంగ వైభవంగా‌ జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము‌ నుంచే మహిళలు‌ బోనాలతో‌ ఆలయానికి చేరుకుంటున్నారు. తల్లి దర్శనం కోసం సాధారణ భక్తులు క్యూ కట్టారు. మోండా మార్కెట్‌ నుంచి‌ మహంకాళి‌ టెంపుల్‌ వరకు అంతా సందడి‌గా మారింది. ఇటువంటి పర్వదినం రోజున 1850 నాటి అమ్మవారి అరుదైన ఫొటో‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.

News July 21, 2024

ADB: ముంభై పోలీసులమంటూ వైద్యురాలికి టోకరా

image

ఈనెల 12న ADB రిమ్స్ వైద్యురాలికి తాము ముంబై పోలీసులమని చెబుతూ ఫోన్ వచ్చింది. ‘మీ ఐడీపై నేరాలు నమోదయ్యాయి’ అని చెప్పడంతో భయంతో వారి మాటలు నమ్మిన ఆమె రూ.3.40 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ నంబర్‌కు ఆమె ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రూ.లక్ష హోల్డ్ చేయగా శనివారం మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

News July 21, 2024

NLG: ఫిర్యాదుల విభాగాలు ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్

image

రుణమాఫీకి సంబంధించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకుగాను ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వివిధ అంశాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News July 21, 2024

ఖమ్మం: ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ, మునిసిపల్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ అధికారులకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News July 21, 2024

ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తాం: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవో ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. బదిలీలకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ, కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.