India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్, బీజేపీ నేతల మాయమాటలు, దొంగ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సికింద్రాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని రాంగోపాల్‌పేట్ డివిజన్‌లో వారు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ప్రజలు KCR వైపే ఉన్నారన్నారు.
మొబైల్ ఫోన్లకు చిన్నపిల్లల నీలి చిత్రాలు షేర్ చేసి, చూస్తున్న వ్యక్తిపై HYD ఘట్‌కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెంగిచెర్ల మాతాఅరవింద కాలనీ వాసి మల్లికార్జునరెడ్డి(54) మొబైల్ ఫోన్‌లో తరచూ చిన్నపిల్లల పోర్నోగ్రఫీ కంటెంట్, అశ్లీల చిత్రాలను చూస్తూ షేర్ చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికలు మరో వారం రోజుల్లో ఉండటంతో వరంగల్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలు పర్యటించారు. మరోసారి కాంగ్రెస్ WGL అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7న రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. WGL, MHBD అభ్యర్థులకు మద్దతుగా ఈ నెల 8న ప్రధాని మోదీ మామునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు సనత్‌నగర్ నుంచి పద్మారావునగర్ వరకు ఆయన బైక్ ర్యాలీ చేయనున్నారు.

శాలిగౌరారం మండలంలో వడదెబ్బకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన ఆలస్యంగా తెలిసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్లూరుకి చెందిన రావుల యాదమ్మ (65), గురజాల గ్రామానికి చెందిన సుల్తాన్ యల్లయ్య(60) శనివారం ఉపాధి పనులకు వెళ్లారు. రాత్రి ఇంటి వద్ద అస్వస్థతకు గురికావడంతో వైద్యం కోసం తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఇంటి వద్ద ఓటు వేసే సదుపాయాన్ని 531 మంది వృద్ధులు ఉపయోగించుకున్నట్లు హైదరాబాద్ ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్ రాస్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 5,233 మంది ఉద్యోగులు తపాలా ఓటు వేశారని, అందులో ఆదివారం ఓటు వేసిన ఎన్నికల అధికారులే 1,914 మంది ఉన్నారని చెప్పారు. ఎన్నికల విధులకు హాజరయ్యే వారు తపాలా ఓటు వేయాలని సూచించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లో 4,004 పోలింగ్ కేంద్రాలకు గాను.. మొత్తం 15,876 మందిని ఎన్నికల విధుల కోసం నియమించినట్లు అధికారులు తెలిపారు. MBNR లోక్‌సభ స్థానంలోని 1,937 పోలింగ్ కేంద్రాలకు 7,748 మంది, NGKL లోక్‌సభ స్థానంలోని 2,067 పోలింగ్ కేంద్రాలకు 8,128 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. వేసవి ఎండల తీవ్రత కారణంగా పోలింగ్ సమయాన్ని సా.5 నుంచి 6 గంటల వరకు పెంచారు.
హైదరాబాద్‌లో ఇంటి వద్ద ఓటు వేసే సదుపాయాన్ని 531 మంది వృద్ధులు ఉపయోగించుకున్నట్లు హైదరాబాద్ ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్ రాస్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 5,233 మంది ఉద్యోగులు తపాలా ఓటు వేశారని, అందులో ఆదివారం ఓటు వేసిన ఎన్నికల అధికారులే 1,914 మంది ఉన్నారని చెప్పారు. ఎన్నికల విధులకు హాజరయ్యే వారు తపాలా ఓటు వేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.