Telangana

News May 6, 2024

ఖమ్మం: నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో II, IV, VI సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 1,70,991 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 122 పరీక్ష కేంద్రాలను, 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

News May 6, 2024

వరంగల్: వడదెబ్బతో రైతు మృతి

image

వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొర్రి బిక్షపతి (40) తన వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి పనులు చేసుకున్నాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లి చెట్టుకింద సేదతీరాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 6, 2024

చిన్నబొంకూరు కన్నీరు!

image

ట్రాక్టర్‌ బోల్తా పడి చిన్నబొంకూర్‌‌కు చెందిన బేతి లక్ష్మీ, మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ <<13186723>>మృతి చెందిన<<>> విషయం విదితమే. రాజమ్మ భర్త రాజకొమురయ్య మృతి చెందగా.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపి కుమారుల పెళ్లి చేసింది. అటు లక్ష్మి త్వరలోనే తన కొడుకు వివాహం జరిపించాలని నిర్ణయించుకుందని ఆమె భర్త విలపించారు.మల్యాల వైష్ణవి పిల్లలు ఇంటి వద్ద అన్నం తింటుండగా..తల్లి మరణ వార్త విని బోరున విలపించారు.

News May 6, 2024

HYD: పేదలను ఆదుకున్న నేత పీఎం మోదీ: మాధవీలత

image

ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు మోదీ మేలు చేశారని బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. HYD కార్వాన్‌లో ఏర్పాటు చేసిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో మాజీ గవర్నర్ తమిళిసైతో కలిసి మాధవీలత పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు బీజేపీకి ఉందని తెలిపారు. సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకున్న నేత పీఎం మోదీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News May 6, 2024

HYD: పేదలను ఆదుకున్న నేత పీఎం మోదీ: మాధవీలత

image

ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు మోదీ మేలు చేశారని బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. HYD కార్వాన్‌లో ఏర్పాటు చేసిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో మాజీ గవర్నర్ తమిళిసైతో కలిసి మాధవీలత పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు బీజేపీకి ఉందని తెలిపారు. సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకున్న నేత పీఎం మోదీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News May 6, 2024

మంచిర్యాల: వరుడి ఇంటి ముందు నవ వధువు ఆందోళన

image

ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు ఆందోళన చేసింది. వివరాలిలా.. గత నెల 24న BPL మండలం కాసిరెడ్డిపల్లెకు చెందిన ప్రవీణ్‌కు MNCLకు చెందిన ఓ యువతి(22)తో వివాహమైంది. పెళ్లయిన నాలుగో రోజే ఆమెను తల్లిగారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఇంట్లో అన్నం తినకుండా, జ్యూస్‌లే తాగుతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు విస్తుపోయారు. ఎస్ఐ నరేశ్‌ సోమవారం ఇరువర్గాలను కౌన్సిలింగ్‌కు రావాలని చెప్పామన్నారు.

News May 6, 2024

మండుతున్న భానుడు.. నిజామాబాద్ @46.2℃

image

ఆదివారం జిల్లాలోనే అత్యధికంగా నిజామాబాద్ ఉత్తరంలో మండల కేంద్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలుగా నమోదైంది. ఇందూరు నగరం రెడ్‌జోన్‌లోకి వెళ్లింది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 36.1 డిగ్రీలు ఉండటం గమనార్హం. భానుడి ప్రతాపంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు ప్రజలు జంకుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News May 6, 2024

MDK: రేపు రేవంత్ రెడ్డి జన జాతర సభ

image

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జన జాతర సభ నిర్వహించనున్నారు. ఈ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు నర్సాపూర్‌లో జరగనున్న ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జన జాతర సభను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

News May 6, 2024

ఖమ్మం జిల్లాలో ఎగిరేది ఏ జెండా..?

image

ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఫైట్ మరింత ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి పోటీ చేస్తుంటే.. బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. ముగ్గురూ పోటాపోటీగా ప్రచారాలు చేస్తుండడంతో.. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లో ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

News May 6, 2024

KMM: గ్రామాల్లో కనిపించని ఎన్నికల సందడి !?

image

ఎన్నికలంటే ఓ పండగ! దాదాపు ఇరవై రోజుల పాటు నిత్యం నాయకుల మాటల పోరు, ర్యాలీలూ, సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో కనిపిస్తున్న ఊర్లలో ఎన్నికల ఊపు కనిపించడం లేదు.