India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MP ఎన్నికల ప్రచారానికి గడువు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. దీంతో పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తీవ్ర ఎండలోనూ నాయకులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పర్యటించి క్యాడర్లో జోష్ నింపారు. అటూ ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. దీంతో ఖమ్మం పార్లమెంట్లో రాజకీయం వేడెక్కింది.
గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మనకు సెమీఫైనల్ లాంటివి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్రవల్లి జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆ ఎన్నికల్లో BRSను ఓడించి ఇంటికి పంపాము. వచ్చే పార్లమెంటు ఎన్నికలు మనకు ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ తెలంగాణ వర్సెస్ గుజరాత్‌గా సాగుతోంది. ఆ మ్యాచ్‌లో గెలిచి మన సత్తా చాటుకోవాలి. BRS, BJPలు చీకటి ఒప్పందాలు చేసుకొని మనల్ని ఓడించాలని చూస్తున్నాయి’ అని సీఎం అన్నారు.
రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను నమ్మించి మరోసారి మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నాడని, దేవుళ్లపై ప్రమాణం మానుకొని తన బిడ్డ మీద ప్రమాణం చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గుడ్డిగా ఈ రాష్ట్రానికి సీఎం అయిన రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని సాధించిన మాజీ CM KCRను విమర్శించే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దళితవర్గాల ప్రయోజనమే తెలంగాణ ప్రయోజనంగా భావించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మొదటి నుంచి దళిత వర్గాలకు అన్ని రకాలుగా అండదండలు అందించారని MRPS రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మాదిగ సామాజిక వర్గం తీరని వేదనకు గురవుతోందని వాపోయారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో II, IV, VI సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 1,70,991 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 122 పరీక్ష కేంద్రాలను, 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
JNTU కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు ఇచ్చిన మాదిరిగానే వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించాలని BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ విద్యాశాఖ అధికారులను కోరారు. OUలో ఆయన మాట్లాడారు. తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాలులతో కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. స్టూడెంట్స్‌కు ఉపశమనం కలిగే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో పాగా వేసేందుకు హస్తం పార్టీ దృష్టిని కేంద్రీకరించింది. ప్రతి గ్రామంలో అభ్యర్థులు స్థానిక నాయకులతో కలిసి ప్రచారంలో స్పీడ్ పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ రెండు స్థానాల్లో గెలుపును ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను ఇన్చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలపై మోపింది.
కామారెడ్డి ఆర్టీవో కార్యాలయంలోని ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదివారం సందర్శించారు. పోలింగ్ విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 8 వరకు ఈ కేంద్రం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రఘునాథ్ రావు, తహశీల్దార్ జనార్ధన్, అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.