Telangana

News April 10, 2024

వదంతులను ఎవరూ నమ్మవద్దు:  వంశీచంద్ రెడ్డి

image

నారాయణపేట జిల్లా రద్దు అవుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై కాంగ్రెస్ MP అభ్యర్థి వంశీచంద్ రెడ్డి స్పందించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అలాంటి ఆలోచన లేదన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు అని స్పష్టం చేశారు. జీఓ69 ఓ కల అని, అది రేవంత్ రెడ్డి సారథ్యంలో జీఓ14 ద్వారా నెరవేరుతుందన్నారు.

News April 10, 2024

NLG: గ్రామాల్లో ప్ర’జల’ కష్టాలు..!?

image

ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. అసలే కరువు, ఆపై ఎండలు ముదిరిపోవడంతో భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో బోర్లు ఎండిపోయాయి. మరోవైపు ఎప్పుడు వస్తాయో తెలవని భగీరథ నీళ్ల కోసం జనాలు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది. భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలన్నారు.

News April 10, 2024

ఖమ్మం: గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ మృతి

image

రఘునాథపాలెం మండలంలోని వీవీ పాలెం ఎస్టీ కాలనీ అంగన్వాడీ టీచర్ బానోత్ రంగాబాయి (46) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగాబాయి మంగళవారం గుండెపోటుకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

News April 10, 2024

HYD: ‘కారు’కు బ్రేక్ వేసేందుకు ‘చేయి’ వ్యూహం!

image

పార్లమెంట్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో అధికార కాంగ్రెస్‌ ప్రచారంలో దూకుడు పెంచింది. తుక్కుగూడలో ఇటీవల నిర్వహించిన జన జాతర సభతో కాంగ్రెస్‌ కేడర్‌లో జోష్‌ మరింత పెరిగింది. HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించాలని, క్షేత్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన BRSకు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతలకు సూచనలు చేశారు. మీ కామెంట్?

News April 10, 2024

నల్గొండ: సూపర్బ్.. 40 ఏళ్లుగా దాహార్తిని తీరుస్తున్న బావి

image

నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడులోని మేడిబావి 40ఏళ్లుగా ప్రజల దాహార్తిని తీరుస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయి మోటార్లు పనిచేయకపోయినా ఈ బావిలో మాత్రం సమృద్ధిగా నీరు లభిస్తుండటంతో గ్రామంలో పలు కాలనీలకు వేసవిలో నీటి ఎద్దడి తప్పింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచి నాంపల్లి రాములు 50ఏళ్ల క్రితం తన వ్యవసాయ అవసరాల నిమిత్తం తన భూమిలో బావిని తవ్వించారు.

News April 10, 2024

HYD: ‘కారు’కు బ్రేక్ వేసేందుకు ‘చేయి’ వ్యూహం!

image

పార్లమెంట్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో అధికార కాంగ్రెస్‌ ప్రచారంలో దూకుడు పెంచింది. తుక్కుగూడలో ఇటీవల నిర్వహించిన జన జాతర సభతో కాంగ్రెస్‌ కేడర్‌లో జోష్‌ మరింత పెరిగింది. HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించాలని, క్షేత్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన BRSకు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతలకు సూచనలు చేశారు. మీ కామెంట్? 

News April 10, 2024

HYD: తాగునీటి సరఫరాకు ప్రత్యేక కార్యచరణ

image

రాజధానిలో అంతర్భాగమైన RR, మేడ్చల్ జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి విజయేంద్రబోయి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఏప్రిల్ తొలి వారం నుంచి జూన్ వరకు 2నెలల పాటు మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లు, మండలాల ప్రత్యేకాధికారులు, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని, జలమండలి, మిషన్ భగీరథ అధికారులతో నిత్యం సంప్రదింపులు నిర్వహించాలన్నారు.

ADB: దంపతుల మధ్య గొడవ.. అడ్డొచ్చిన తండ్రిపై కత్తితో దాడి

image

కొడుకు, కోడలు గొడవ పడుతుంటే వారించడానికి వెళ్లిన తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SI రవికుమార్ వివరాల ప్రకారం.. స్థానిక చేపల మార్కెట్ వద్ద నివాసం ఉంటున్న రాజుకు అతడి భార్య మధ్య గొడవ జరిగింది. రాజు తండ్రి రవీందర్ వారిని వారించే ప్రయత్నం చేశాడు. మా మధ్యలోకి ఎందుకు వస్తున్నావంటూ రాజు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో తండ్రిపై దాడి చేశాడు.

News April 10, 2024

MBNR, NGKLలో మహిళలదే ఆధిపత్యం !

image

MBNR, NGKL లోక్ సభ పరిధిలో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. MBNR పరిధిలో పురుషులు 8,28,944 మంది ఉండగా మహిళలు 8,46,308 మంది ఉన్నారు. NGKL లోక్ సభ పరిధిలో పురుషులు 8,61,980 మంది ఉండగా మహిళా ఓటర్లు 8,69,803 మంది ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 25,187 మంది అధికంగా ఉన్నారు.