India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డికి ఆ నాలుగు ఎంపీ స్థానాలు ఎంతో కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో MBNR, NGKL ఎంపీ స్థానాలతో పాటు సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, స్నేహితుడు పోటీ చేస్తున్న భువనగిరి స్థానాలు కీలకంగా మారాయి. వారిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
భానుడి ప్రతాపానికి బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది. దాదాపు ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల బీర్లు లేవు అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా బీరు ఉత్పత్తి కాకపోవడంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు వైన్ షాపుల ముందు నో బీర్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక మద్యం ప్రియులు బీర్లను తాగి ఉపశమనం పొందాలనుకున్నా వారికి నిరాశే కలుగుతుంది.
వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.
ఎర్రవల్లిలో కాంగ్రెస్ సభ నేపథ్యంలో వాహనదారులకు గద్వాల SP రితిరాజ్ పలు సూచనలు చేశారు. గద్వాల నుంచి సభకు వచ్చే వాహనాలు ధన్వంతరి మెడికల్ షాప్ సమీపంలో ఖాళీ వెంచర్‌లో నిలుపుకోవాలన్నారు. షేక్‌పల్లి నుంచి వచ్చే వాహనాలు వైన్ షాప్ ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో, కర్నూలు వైపు నుంచి వచ్చే వాహనాలు పుల్లారెడ్డి పెట్రోల్ పంపు లెఫ్ట్ సైడ్, బీచుపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు ఏకశిలా స్కూల్ వద్ద పార్కు చేసుకోవాలన్నారు.
MP ఎన్నికల్లో సికింద్రాబాద్ హాట్ ఫేవరేట్‌గా మారింది. కిషన్ రెడ్డి, పద్మారావు, దానం పోటీలో ఉండటం అంచనాలు పెంచింది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడ జాతీయ పార్టీలదే హవా. ఒకే ఒక్కసారి తెలంగాణ ప్రజాసమితి(1971) గెలిచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా BRS ఖాతా తెరవలేదు. ఈసారి పజ్జన్న నిలబడటంతో టగ్ ఆఫ్ వార్ అని టాక్. BJP, INC గెలుపుపై ధీమాతో ఉన్నారు. ప్రజానాడీ ఎటువైపనేది ఉత్కంఠగా మారింది.
MP ఎన్నికల్లో సికింద్రాబాద్ హాట్ ఫేవరేట్‌గా మారింది. కిషన్ రెడ్డి, పద్మారావు, దానం పోటీలో ఉండటం అంచనాలు పెంచింది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడ జాతీయ పార్టీలదే హవా. ఒకే ఒక్కసారి తెలంగాణ ప్రజాసమితి(1971) గెలిచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా BRS ఖాతా తెరవలేదు. ఈసారి పజ్జన్న నిలబడటంతో టగ్ ఆఫ్ వార్ అని టాక్. BJP, INC గెలుపుపై ధీమాతో ఉన్నారు. ప్రజానాడీ ఎటువైపనేది ఉత్కంఠగా మారింది.
సమస్యలు తెలిసి అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్స్ ఆలోచించి ఓటు వేయాలని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు అభివృద్ధి కోసం వయో వృద్ధులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానని, ఎన్నికలలో బిజెపికి ఓటు వేసి తనను గెలిపించాలని డీకే అరుణ అభ్యర్థించారు.
నిర్మల్‌లో నిర్వహించిన జనసభలో రాహుల్ గాంధీ మాట్లాడిన ముఖ్యాంశాలు. ★ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేసి తీరుతాం ★త్వరలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం
★ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చిన మోదీ ప్రభుత్వం ★రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకం ★కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ★ఉపాధి హామీ కింద రోజుకు 400 కూలీ ఇస్తాం ★ప్రతి మహిళ అకౌంట్‌లో ఏడాదికి రూ.లక్ష వేస్తాం.
నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. చందంపేట మండలం తెల్దేవరపల్లిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం , మాడ్గులపల్లి, నాంపల్లి, తిప్పర్తి మండలంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. కట్టంగూర్, చందంపేట, పీఏపల్లి మండలం కోదాండాపురం, నిడమనూరు, హాలియా, ఇబ్రహీంపేట, కనగల్ తదితర మండలాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఖమ్మంలో హీరో వెంకటేశ్ క్యాంపెయిన్ షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఎల్లుండి సాయంత్రం 5గంటలకు మయూరి సెంటర్, పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు కొత్తగూడెంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు.
Sorry, no posts matched your criteria.