Telangana

News May 5, 2024

170 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం: HMWSSB

image

వేసవి తాపంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు HYD జలమండలి సిద్ధమైంది. వివిధ అవసరాల కోసం బయటకి వచ్చే సామాన్య ప్రజలు, ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు నగరంలో ప్రధాన ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైతు బజార్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేస్తోంది. ఇందు కోసం GHMC పరిధిలో 170 చలివేంద్రాలు ఏర్పాటు చేశామని ఆదివారం తెలిపారు.

News May 5, 2024

పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తానాబాద్ మండలం రేగటి మద్దికుంటలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 5, 2024

గ్రామాల్లో కనిపించని ఎన్నికల సందడి

image

ఎన్నికలంటే ఓ పండగ! దాదాపు ఇరవై రోజుల పాటు నిత్యం నాయకుల మాటల పోరు ర్యాలీలూ,  సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. కానీ,ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో కనిపిస్తున్న ఊర్లలో ఎన్నికల ఊపు కనిపించడం లేదు.

News May 5, 2024

KNR: మామిడి చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి

image

మామిడి చెట్టు పై నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కన్నాపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి ఎల్లయ్య ఇంటి ఆవరణంలోని మామిడి చెట్లు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని భార్య కొమురమ్మ తెలిపారు.

News May 5, 2024

ఎవరికో ‘వరం’గల్‌..!

image

ఎస్సీలకు రిజర్వ్‌ అయిన వరంగల్ లోక్‌సభ స్థానంలో మొత్తం 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధానంగా కాంగ్రెస్‌, BRS, BJPల మధ్యే గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్‌ నుంచి కడియం కావ్య, BJP నుంచి అరూరి రమేశ్‌, BRS నుంచి సుధీర్‌కుమార్‌లు తలపడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం వేళల్లో కల్యాణ మండపాల్లో సమావేశాలు నిర్వహించి గెలిస్తే తామేం చేస్తామో వివరిస్తున్నారు.

News May 5, 2024

భిన్నమైన తీర్పిస్తారా..?

image

2019 ఎన్నికల్లో నల్గొండ MP స్థానంలో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. 2018లో ఆ లోక్‌సభ పరిధిలోని SRPT, KDD, HNR, MLG, సాగర్‌, NLG, DVK అసెంబ్లీ స్థానాలు BRS విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో SRPT మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఈ క్రమంలో ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు పాత ఒరవడికి కట్టుబడి భిన్నమైన తీర్పు ఇస్తారా అనే భావన వ్యక్తం అవుతోంది.

News May 5, 2024

AI అద్భుతం.. HYD అందాలు..!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నూతన టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తోంది. HYD మహానగరంలోని చార్మినార్, సెక్రటేరియట్, రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి లాంటి పర్యాటక ప్రాంతాల AI ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. AI ద్వారా రూపొందించిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయంటూ నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. HYD నగర కట్టడాల ఫొటోలను నూతనంగా రూపొందించడంలో టెక్నో క్రాంట్లు వారి ప్రతిభను కనబరుస్తున్నారు.

News May 5, 2024

AI అద్భుతం.. HYD అందాలు..!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నూతన టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తోంది. HYD మహానగరంలోని చార్మినార్, సెక్రటేరియట్, రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి లాంటి పర్యాటక ప్రాంతాల AI ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. AI ద్వారా రూపొందించిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయంటూ నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. HYD నగర కట్టడాల ఫొటోలను నూతనంగా రూపొందించడంలో టెక్నో క్రాంట్లు వారి ప్రతిభను కనబరుస్తున్నారు.

News May 5, 2024

ఖమ్మం: మొత్తం 11 నామినేషన్లు

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

News May 5, 2024

MBNR: సీఎం రేవంత్ రెడ్డికి ఆ 4 స్థానాలే ఎంతో కీలకం !

image

సీఎం రేవంత్ రెడ్డికి ఆ నాలుగు ఎంపీ స్థానాలు ఎంతో కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో MBNR, NGKL ఎంపీ స్థానాలతో పాటు సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, స్నేహితుడు పోటీ చేస్తున్న భువనగిరి స్థానాలు కీలకంగా మారాయి. వారిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.