Telangana

News September 7, 2024

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

image

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు నుంచి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు అంటే ఈనెల 17వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ఆయన కోరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు
> వరద ప్రభావిత ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ పర్యటన
>వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష
>సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
>ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రజలు
>ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కి సెలవు
>వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News September 7, 2024

హైదరాబాద్ అంతా NIGHT OUT

image

వినాయక చవితి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో యువత నైట్ అవుట్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఏ వీధిలో చూసినా యువకులు మండపాలు వేయడం, డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు నాగోల్, ధూల్‌పేట్‌కు పోటెత్తారు. మరోవైపు పలు చోట్ల పండుగ సామగ్రి విక్రయ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండడంతో సందడి నెలకొంది. వినాయక చవితి తమకు స్పెషల్ ఫెస్టివల్ అని యువకులు తెలిపారు.

News September 7, 2024

ఖమ్మం: రూ.3.43 కోట్లకు వ్యాపారి ఐపి

image

ఖమ్మం బ్యాంకు కాలనీకి చెందిన పురుగుమందుల వ్యాపారి నూతలపాటి రవి స్థానిక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో రూ.3.43 కోట్లకు శుక్రవారం ఐపీ దాఖలు చేశారు. 32 మంది రెండు దాతలను ప్రతివాదులుగా చేర్చారు. కామేపల్లి మండలం పెంజరమడుగుకు చెందిన పిటిషనర్ పండితాపురంలో పురుగుమందులు, విత్తనాల వ్యాపారం నిర్వహించాడు. వ్యాపార నిమిత్తం తెచ్చిన అప్పులు తీర్చలేక ఐపీ దాఖలు చేశారు.

News September 7, 2024

హైదరాబాద్ అంతా NIGHT OUT

image

వినాయక చవితి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో యువత నైట్ అవుట్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఏ వీధిలో చూసినా యువకులు మండపాలు వేయడం, డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు నాగోల్, ధూల్‌పేట్‌కు పోటెత్తారు. మరోవైపు పలు చోట్ల పండుగ సామగ్రి విక్రయ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండడంతో సందడి నెలకొంది. వినాయక చవితి తమకు స్పెషల్ ఫెస్టివల్ అని యువకులు తెలిపారు.

News September 7, 2024

NLG: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించుకోవాలి: జిల్లా కలెక్టర్

image

వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆది దేవుడైన వినాయకుడు సర్వవిఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని, భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవాలని తెలిపారు.

News September 7, 2024

ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను, ఈద్ – మిలాద్- ఉన్ -నబీ, ఇతర పండగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటి సభ్యులకు సూచనలు చేస్తూ ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి మెదక్ జిల్లాలో ఉన్నదన్నారు.

News September 7, 2024

కుబీర్: వినాయక చవితికి స్పెషల్ ఈ కర్ర గణపతి

image

వినాయక చవితికి మహారాష్ట్ర ప్రాంతంలోని పాలజ్ కర్ర గణపతికి ఓ ప్రత్యేకత ఉంది. కుబీర్ సమీపంలో ఉంటే ఈ గణపతిని 1948లో ప్రతిష్ఠించారు. 1948లో పాలజ్‌లో  అంటువ్యాధులు ప్రబలి 30మందికి పైగా మరణించారు. ఆ సంవత్సరం వచ్చిన వినాయకచవితికి అక్కడి ప్రజలు నిర్మల్‌లో కొయ్య గణపతిని చేయించి వారి గ్రామంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతిసంవత్సరం నిమజ్జనం చేయకుండా గణపతికి పూజలు చేస్తున్నారు.

News September 7, 2024

మండప వివరాలు నమోదు చేసుకోండి: SP

image

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వివరాలను జిల్లా పోలీస్ శాఖ వారు రూపొందించిన పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఎస్పీ జానకి తెలిపారు.https://policeportal.tspolice.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేయాలని, భద్రత, బందోబస్తు కోసం మాత్రమేనని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు, వదంతులను నమ్మవద్దని, ఎలాంటి సందేహాలు ఉన్నా డయల్ 100కు కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ 87126 59360కు ఫోన్ చేయాలన్నారు.