Telangana

News May 5, 2024

మెదక్: బీజేపీని గెలిస్తే దేశాన్ని అమ్మేస్తారు: కొండా సురేఖ

image

ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో BRS నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చేందుకే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బీజేపీతో పేదలకు ఒరిగిందేమీ లేదని, వారు అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మడం ఖాయమని విమర్శించారు.

News May 5, 2024

MBNR: మరో వారం.. ప్రచారం జోరు

image

MP ఎన్నికల ప్రచారానికి గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తీవ్ర ఎండలోనూ నాయకులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పర్యటించి క్యాడర్‌లో జోష్ నింపారు. అటూ ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. దీంతో MBNR, NGKL పార్లమెంట్లో రాజకీయం వేడెక్కింది.

News May 5, 2024

HNK: వరకట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని సూసైడ్

image

వరకట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HNKలో జరిగింది. పోలీసుల వివరాలు.. ములుగు జిల్లా మంగపేట మం. బోరు నర్సాపూర్‌‌కు చెందిన రాంనర్సయ్యకు ఏటూరునాగారంకు చెందిన సఫియా(38)తో వివాహమైంది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. రాంనర్సయ్య చెడు వ్యసనాలకు బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధించాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని హింసించడంతో సఫియా శనివారం ఉరేసుకుంది.

News May 5, 2024

గద్వాల: జన జాతర సభకు సర్వం సిద్ధం..!

image

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో నేడు జరిగే జన జాతర సభకు అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. సభావేదిక ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పార్కింగ్, హెలిపాడ్ సర్వం సిద్ధం చేశారు. సభకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లురవి ఇతర కాంగ్రెస్ ప్రముఖులు హాజరుకానున్నారు.

News May 5, 2024

KNR: భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల పురాణిపేటలో జరిగింది. బింగి నవీన్ గోదావరికి చెందిన జ్యోత్స్నతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. భార్య కాపురానికి రానని చెప్పడంతో దీంతో మనస్తాపానికి గురైన శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు.

News May 5, 2024

ఆదిలాబాద్: రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు జరగనున్నాయి.

News May 5, 2024

నల్గొండ: మొత్తం 11 నామినేషన్లు

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

News May 5, 2024

MBNR: నేడు నీట్ పరీక్ష.. రూల్స్ ఇవే..

image

నీట్- 2024 పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అధికారుల సూచనలు.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని, ఆభరణాలు కూడా ధరించి రావొద్దన్నారు. హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ మాత్రమే ధరించాలని, బూట్లు కాకుండా స్లిప్పర్లు మాత్రమే వేసుకోవాలి. కేంద్రాల్లో నిర్వాహకులే పెన్నులు ఇస్తారని చెప్పారు.

News May 5, 2024

HYD: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

image

HYD పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్‌ వద్ద కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల చిన్నారి రిషిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని గమనించిన స్థానికులు కుక్కలను తరిమేయడంతో ప్రాణాపాయం తప్పింది. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని స్థానికులు ఆరోపించారు.

News May 5, 2024

HYD: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

image

HYD పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్‌ వద్ద కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల చిన్నారి రిషిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని గమనించిన స్థానికులు కుక్కలను తరిమేయడంతో ప్రాణాపాయం తప్పింది. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని స్థానికులు ఆరోపించారు.