Telangana

News May 5, 2024

సిద్దిపేట: సోషల్ మీడియాపై ప్రత్యేక సెల్‌

image

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో షోషల్ మీడియాపై సిద్దిపేట కమిషనరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో హోం మంత్రి అమిత్ షా, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఫేక్ ప్రచారం నేపథ్యంలో ప్రత్యేక దృష్టిసారించారు. ఈ టీం పార్టీల నేతలు, కార్యకర్తలు చేసే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, X,యూట్యూబ్‌, రీల్స్‌ వీడియోలు, పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదు చేస్తే చర్యలకు సన్నద్ధమవుతున్నారు.

News May 5, 2024

హోం ఓటింగ్‌కు 1,026 మందే దరఖాస్తు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు మొత్తం 1028 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ లోక్ సభ స్థానం పరిధిలో 539 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్దులు 296 మంది, దివ్యాంగులు 243 మంది ఉన్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో 487 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్ధులు 228, దివ్యాంగులు 259 మంది ఉన్నారు.

News May 5, 2024

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీలోకి బొమ్మ శ్రీరాంచక్రవర్తి!

image

కరీంనగర్ లోక్ సభ పరిధిలోని హుస్నాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల్లో BJP అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మ శ్రీరాంచక్రవర్తి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 3 రోజుల క్రితం మంత్రి పొన్నం, కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు శ్రీరాంచక్రవర్తితో మంతనాలు జరిపినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేర్పించేందుకు మంత్రి ప్రభాకర్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిసింది.

News May 5, 2024

MHBD: ఒకే వీధి.. తండ్రిది AP.. కుమారుడిది తెలంగాణ

image

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. ఉమ్మడి APలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. విజభన తర్వాత ఆయన అరకు లోక్‌సభ పరిధిలోకి వచ్చింది. మరోవైపు అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.

News May 5, 2024

సూర్యాపేట: వ్యవసాయ బావిలో పడి రైతు మృతి

image

అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియలలో వ్యవసాయ బావిలో పడి జల్లా రామకృష్ణ అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ పొలం దగ్గర వ్యవసాయ మోటారు చూడటానికి వెళ్లాడు. బావిలో నీరు తాగేందుకు దిగగా కాలుజారి నీళ్లలో పడ్డాడు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు. భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.

News May 5, 2024

నేడు జిల్లాకు గులాబీ బాస్

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు జిల్లాకు రానున్నారు. సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు షో నిర్వహించనున్నారు. నిజామాబాద్ లోక్ సభ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరఫున ప్రచారం నిర్వహిస్తారు.

News May 5, 2024

కామారెడ్డి: ఉరేసుకుని వ్యక్తి మృతి

image

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి అంబదాస్(30) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 5, 2024

మంచిర్యాల: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

image

మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ ఈరోజు ఉదయం వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. తాండూరు మండలానికి చెందిన ఆయన రెబ్బెన పరిధిలో విధులు నిర్వహించినట్లు మండల వాసులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

News May 5, 2024

వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం

image

ఈ వేసవిలో నానాటికీ ఎండలు పెరుగుతున్నాయి. పలువురు వడదెబ్బ బారిన పడి చికిత్స పొందుతుండగా ఇంకొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే, వడదెబ్బ మృతుల్లో పేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందుతుంది. ఇందుకోసం ప్రతీ మండలానికి త్రిసభ్య కమిటీని నియమించగా.. వీరు విచారణ జరిపి నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తారు. అక్కడ పరిశీలన అనంతరం రూ.50 వేలు పరిహారం మంజూరు చేస్తారు.

News May 5, 2024

భద్రాద్రి: ఒకే వీధి.. తండ్రిది AP.. కుమారుడిది తెలంగాణ

image

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. ఉమ్మడి APలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. విజభన తర్వాత ఆయన ఇల్లు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చింది. మరోవైపు అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది ఏపీలోని అరకు లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.