Telangana

News May 5, 2024

KMM: ఎన్నికల ప్రచారానికి 6 రోజులే గడువు

image

ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వానికి 6 రోజులే గడువుంది. 13న పోలింగ్ జరగనుండగా 2 రోజుల ముందుగా 11న సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీల అధినేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సభలు, కార్యక్రమాలకు ఇబ్బందిగా మారాయని అభ్యర్థులు చెబుతున్నారు. అనుకున్న స్థాయిలో ప్రచార షెడ్యూల్ పూర్తి చేయలేకపోతున్నారు.

News May 5, 2024

హోం ఓటింగ్‌కు 1,026 మందే దరఖాస్తు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు మొత్తం 1028 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ లోక్ సభ స్థానం పరిధిలో 539 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్దులు 296 మంది, దివ్యాంగులు 243 మంది ఉన్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో 487 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్ధులు 228, దివ్యాంగులు 259 మంది ఉన్నారు.

News May 5, 2024

NLG: మిగిలింది వారం రోజులే

image

లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతోంది. జనంలోకి వెళ్లేందుకు అభ్యర్థులకు వారం రోజులే మిగిలి ఉంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. పోలింగ్ కు 48 గంటల ముందే ప్రచారం ముగియనున్నందున ఈ లోపు ఎక్కడెక్కడ అయితే ముఖ్యమైన సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

News May 5, 2024

PU డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు ఈనెల 16 నుంచి నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం పరీక్షల టైం టేబుల్ విడుదల చేశారు. 2వ, 4వ సెమిస్టర్ పరీక్ష ఉదయం 9:30 నుంచి మ.12:30 గంటల వరకు, 5, 6వ సెమిస్టర్ విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా. 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడాలన్నారు.

News May 5, 2024

KNR: వివాహిత ఆత్మహత్య

image

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మత్తారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పారుపల్లికి చెందిన జెల్ల రాజేశ్వరి(25) కడుపు నొప్పితో భాదపడుతుంది. ఆస్పత్రుల్లో చూపించుకొని, మందులు వాడినా నయం కాలేదు.  దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News May 5, 2024

హుజూర్‌నగర్: ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ ఫలితాల్లో తప్పడంతో విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన హుజూర్‌నగర్‌‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విద్యార్థి (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 29న ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి, మెరుగైన వైద్యం ఖమ్మం.. అక్కడి హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

News May 5, 2024

HYD: ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో అల్లు అర్జున్

image

HYD ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సినీ హీరో అల్లు అర్జున్ శనివారం సందడి చేశారు. కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన తన డాక్యుమెంట్లను రవాణా శాఖ కార్యాలయంలో అందజేశారు. అల్లు అర్జున్ బీఎండబ్ల్యూ ఐ7 కారుకు నంబర్ కేటాయించినట్లు రవాణా శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు.

News May 5, 2024

ఇది ఆత్మగౌరవానికి జరిగే ఎన్నిక: వంశీచంద్ రెడ్డి

image

ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పార్టీల మధ్య జరుగుతున్న పోటీ కాదు.. జిల్లా ఆత్మగౌరవానికి, రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో చూపించే ఎన్నిక అని మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. “ఇది పాలమూరు భవిష్యత్తు తరాల కోసం జరిగే ఎన్నిక, కేంద్రంలో BJP, రాష్ట్రంలో BRS పదేళ్లు అధికారంలో ఉండి మనల్ని బానిసలుగా చూశారని, పాలమూరు పౌరుషాన్ని చూపాలని, 13న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేయాలని” కోరారు.

News May 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔GDWL: నేడు ఎర్రవల్లిలో జన జాతర.. హాజరుకానున్న రాహుల్ గాంధీ,CM రేవంత్ రెడ్డి
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ
✔త్రాగునీటి సమస్యలపై ఫోకస్
✔ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక చెక్ పోస్టులు.. కొనసాగుతున్న తనిఖీలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔నేడు పలువురు కాంగ్రెస్, BJPలో చేరికలు
✔MP ఎన్నికలు.. సోషల్ మీడియాపై అధికారుల దృష్టి
✔’సమ్మర్ క్రికెట్ శిబిరాల’పై నజర్

News May 5, 2024

నిర్మల్: రెడ్ జోన్‌లో 5 మండలాలు

image

నిర్మల్ జిల్లాలో 45.7 డిగ్రీల అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ఐదు మండలాలైన నర్సాపూర్ జి, కడెం, కుబీర్, ఖానాపూర్, భైంసా మండలాలను వాతావరణ శాఖ అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించింది. వీటిలో 45.1 డిగ్రీ నుంచి 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించి బయటకు వెళ్లాలని సూచించారు.