Telangana

News July 20, 2024

భద్రాచలం: లోతట్టు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

భద్రాచలం నుండి 5 లక్షల 89 వేల 743 క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని చెప్పారు. ఏదేని అత్యవసర సేవలకు 24 గంటలు పనిచేయు విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

News July 20, 2024

NLG: కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే

image

రాజ్ భవన్ ముందు కేటీఆర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు గవర్నర్‌ను కలవడానికి సిగ్గుండాలి అన్నారు. రాజ్యాంగాన్ని ఖననం చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా అని మండిపడ్డారు. తెలంగాణలో పదేళ్లలో ప్రతిపక్షం లేకుండా చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.

News July 20, 2024

NZB: ఏడాదిన్నరలో రోడ్డు ప్రమాదాల్లో 550 మంది మృతి

image

NZB జిల్లాలో గడిచిన ఏడాదిన్నరలోనే రోడ్డు ప్రమాదాలలో 550 మంది ప్రాణాలు కోల్పోయారని CP కల్మేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుబెల్టు ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ టేక్, సెల్ ఫోన్ డ్రైవింగ్, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

News July 20, 2024

సికింద్రాబాద్‌లో ఆమ్రపాలి కాట ఇన్‌స్పెక్షన్

image

రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట ఏర్పాట్లను పరిశీలించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంతో పాటు పలు దేవాలయాలకు సంబంధించిన రూట్‌లపై ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్, తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లో అందుబాటులో ఉండాలన్నారు.

News July 20, 2024

సికింద్రాబాద్‌లో ఆమ్రపాలి కాట ఇన్‌స్పెక్షన్

image

రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట ఏర్పాట్లను పరిశీలించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంతో పాటు పలు దేవాలయాలకు సంబంధించిన రూట్‌లపై ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్, తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లో అందుబాటులో ఉండాలన్నారు.

News July 20, 2024

MBNR: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేతాన్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని తెలిపారు. జిల్లాలో వర్షాల దాటికి వాగులు ప్రవహిస్తున్న దృష్ట్యా ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. ఏమైనా అపాయం పొంచి ఉన్నా, ప్రమాదాలు జరిగిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు.

News July 20, 2024

HYD: అర్ధాంగి లేదనే బాధతో మృతిచెందిన భర్త

image

ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. పద్మారావు‌నగర్ స్కందగిరి‌లో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

News July 20, 2024

HYD: అర్ధాంగి లేదనే బాధతో మృతిచెందిన భర్త

image

ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. సికింద్రాబాద్‌లోని పద్మారావు‌నగర్, స్కందగిరి‌లో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

News July 20, 2024

HYD: త్వరలో చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి

image

సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సీఎస్ శాంతి కుమారితో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైల్వే డెవలప్మెంట్ సంబంధించి చర్చ జరిగిందని, రాబోయే కొద్ది నెలల్లోనే పలు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ సైతం త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు.

News July 20, 2024

భద్రాచలం: ఐటీడీఏ కేంద్రంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీడీఏ కేంద్రంగా ప్రధాన సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులో 79952 68352 నెంబర్‌కు కాల్ చేయాలని ఐటిడిఏ అధికారులు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమై మైదాన ప్రాంతాలకు రావాలని చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించారు.