India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోస్టల్ ఓటుకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, ఎన్నికల విధులకు వెళ్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. నారాయణపేట గురుకుల సంక్షేమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని రెండవ రోజు శనివారం పరిశీలించారు. పొరపాట్లు జరగకుండా ఓటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నమోదైన ఓట్ల వివరాలు తెలుసుకున్నారు.
HYD హుస్సేన్ సాగర్ మురుగు కూపంగా మారుతోంది. నిత్యం నాలాల నుంచి వస్తోన్న వ్యర్థాలు సాగర్ ఒడ్డున ఎక్కడికక్కడ పేరుకు పోతున్నాయి. రోజు రోజుకు హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత పడిపోతోంది. నీటిలో కరిగి ఉండాల్సిన ఆక్సిజన్ 4MG కాగా.. తాజాగా పీసీబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, అంతకు తక్కువగా 3.2MG నమోదైంది. నీటిలో కరిగి ఉండే O2 శాతం తగ్గటం వల్ల జలచరాలు మరణించే ప్రమాదం ఉంది.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్రషర్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ సభాస్థలి ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పరిశీలించారు. హెలి ప్యాడ్, పార్కింగ్, తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి కోరారు. షీటీమ్ రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా ప్రాంత షీటీం అధికారుల నంబర్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం -8712662600, కుషాయిగూడ-8712662601, ఎల్బీనగర్ -8712662602, మల్కాజిగిరి -8712662603, వనస్థలిపురం-8712662604 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, భద్రత ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి కోరారు. షీటీమ్ రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా ప్రాంత షీటీం అధికారుల నంబర్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం -8712662600, కుషాయిగూడ-8712662601, ఎల్బీనగర్ -8712662602, మల్కాజిగిరి -8712662603, వనస్థలిపురం-8712662604 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా సోషల్ మీడియాలో పెట్టే వివిధ పోస్ట్‌లపైన నిరంతరం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఎవరైన సామాజిక మాధ్యమాల్లో వాట్స్ అప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్‌లో రాజకీయ పార్టీలపై, వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పన్నారు.
ఓటర్లు మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్ నుంచి అదాలత్ కూడలి వరకు ర్యాలీని నిర్వహించారు.
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా పారదర్శకంగా ఈవిఎం యంత్రాల కేటాయింపు పూర్తి చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం లోక్ సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ కోల్టేతో కలిసి ఈవిఎం యంత్రాల రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.