Telangana

News July 20, 2024

BREAKING: HYD: సనత్‌నగర్ సీఐపై సీపీ చర్యలు 

image

HYD సనత్‌నగర్ సీఐ పురేందర్ రెడ్డిపై సైబరాబాద్ సీపీ చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనతో సీఐ అసభ్యకరంగా చాటింగ్ చేశాడని బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలంటూ చాటింగ్ చేశాడని పేర్కొంది. మెసేజ్‌లను చూయించింది. దీంతో సీఐను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

News July 20, 2024

భద్రాచలం వద్ద 34 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం మధ్యాహ్నం 1 గంటకు 34 అడుగుల మేర ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను జిల్లా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు.

News July 20, 2024

HYD: అప్పులు చేసిన ఘనత KCRది: మహేశ్ కుమార్ గౌడ్

image

పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత మాజీ సీఎం KCRది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, MLCమహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పలువురు BRS నుంచి కాంగ్రెస్‌లో చేరగా ఆయన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రూ.2లక్షల రుణమాఫీ చేసి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని కొనియాడారు. BRS హయాంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?

కట్టంగూర్: లారీ, డీసీఎం ఢీ.. ఒకరి మృతి

image

నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని, పంజాబ్ రాష్ట్రానికి చెందిన డీసీఎం వాహనం శనివారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని నల్గొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

News July 20, 2024

లష్కర్‌ బోనాల ఏర్పాట్లు పరిశీలించిన పొన్నం

image

రేపు, ఎల్లుండి లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ అధికారులు, పోలీసులను ఆయన ఆదేశించారు. బోనాలు తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

News July 20, 2024

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

image

అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరద ప్రవాహాల వద్దకు సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదాలకు బారిన పడవద్దని, అత్యవసర సమయంలో 100కు ఫోన్ చేసి సాయం పొందాలని, శిథిలావస్థకు వచ్చిన నివాసాల్లో ఉండవద్దని, చేపల వేటకు వెళ్లొద్దని, చెరువులు, వాగులు వద్దకు వెళ్లకూడదన్నారు.

News July 20, 2024

లష్కర్‌ బోనాల ఏర్పాట్లు పరిశీలించిన పొన్నం

image

రేపు, ఎల్లుండి లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ అధికారులు, పోలీసులను ఆయన ఆదేశించారు. బోనాలు తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. 

News July 20, 2024

కాజీపేట నుంచి ప్రత్యేక రైళ్ల పొడిగింపు

image

సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా పట్నా, దానాపూర్ నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 03253 పట్నా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 30 వరకు, 07255 హైదరాబాద్- పట్నా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 2 వరకు, 03225/26 దానాపూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 29 వరకు పొడిగించారు. రైళ్లలో రద్దీ అధికంగా ఉండటం వల్ల రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

News July 20, 2024

మంథని: బస్టాండ్‌లో చేపలు పడుతున్న ప్రయాణికులు

image

మంథని మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు చిన్న పాటి చెరువును తలపించేలా మారిపోయింది. బస్టాండ్‌లోకి వరద రావడంతో అందులో చేపలు కనబడుతున్నాయని ప్రయాణికులు నీటిలోకి దిగారు. వారు చేపలు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.