Telangana

News September 7, 2024

నిర్మల్: ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై మండల తాహశీల్దార్‌లతో ఆమె సమీక్షించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.

News September 7, 2024

తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లా: బండిసంజయ్

image

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు బాగా నష్టపోయాయని కేంద్రమత్రి బండి సంజయ్ HYDలో అన్నారు. నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం TG, APకి కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. ఇదీ రాజకీయాలతో కూడిన సమస్య కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి.. రాజకీయాలను పక్కనపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లినట్లు పేర్కొన్నారు.

News September 7, 2024

తప్పని పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లా: బండిసంజయ్

image

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు బాగా నష్టపోయాయని కేంద్రమత్రి బండి సంజయ్ HYDలో అన్నారు. నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం TG, APకి కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. ఇదీ రాజకీయాలతో కూడిన సమస్య కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి.. రాజకీయాలను పక్కనపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లినట్లు పేర్కొన్నారు.

News September 6, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> BHPL: మానవత్వం చాటుకున్న ఎస్సై శ్రావణ్ కుమార్
> MLG: బొగతా జలపాతం సందర్శన షురూ
> HNK: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం
> WGL: కాంస్య పతకం సాధించి రాష్ట్రానికి చేరుకున్న దీప్తి జీవాంజి
> MLG: దేశంలోనే ఇలాంటి విపత్తు చూడలేదు: ఈటల
> HNK: కాళోజీ కళాక్షేత్రాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం: కేటీఆర్
> WGL: ‘మావో’ల ఎన్కౌంటర్‌కు టోర్నడో ఎఫెక్ట్!
> WGL: జిల్లాకు ‘వాడ్రా’ వచ్చేస్తుంది..!

News September 6, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> JN: కరెంట్ షాక్‌తో పెంబర్తి వ్యక్తి మృతి
> MHBD: గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరిపై కేసు
> HNK: ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య
> MHBD: ముల్కలపల్లి ఆకేరు వర్క్ వద్ద గుర్తుతెలియని మృతదేహం
> HNK: అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యం పట్టివేత
> MHBD: విష జ్వరంతో ఒకరి మృతి
> JN: వాట్సాప్ యూజర్లకు సీఐ హెచ్చరిక
> HNK: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు.

News September 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఓపెన్
✔ఫ్రీ కరెంట్.. ఉమ్మడి జిల్లాకు రూ.20 కోట్ల భారం
✔మళ్లీ వర్షం..MBNR- తాండూర్ రహదారి బంద్
✔భారీ వర్షం.. పలు చెరువుల నుంచి వరద
✔సుంకేసుల జలాశయం 5 గేట్ల ఎత్తివేత
✔కులగణన పోరాటానికి మద్దతు ఇస్తాం:CPI
✔పలుచోట్ల మట్టి వినాయకులు పంపిణీ
✔రుణమాఫీ కానీ రైతులు ఆందోళన పడొద్దు: కలెక్టర్లు
✔ఫ్రైడే డ్రైడే.. సీజనల్ వ్యాధులపై ఫోకస్
✔ పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి:SIలు

News September 6, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

☆ సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం: భద్రాద్రి ఎస్పీ ☆ మహిళా రైతులు ఆర్థికంగా ఎదగాలి: భద్రాద్రి కలెక్టర్ ☆ తేనెటీగల పెంపకం శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం: PO ☆ గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్: మధిర ఏడిఈ ☆ ఖమ్మం ప్రకాష్ నగర్ వంతెనపై రాకపోకలు బంద్ ☆ తిరుమల శ్రీవారి సన్నిధిలో TGICD చైర్మన్ మువ్వా ☆ ఖమ్మంలో శిథిలావస్థకు చేరిన భవనాలు కూల్చివేత ☆ గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

News September 6, 2024

నిజామాబాద్: ఈరోజు ముఖ్యమైన వార్తలు

image

KMR:భిక్నూర్ లో మహిళా దారుణ హత్య* బాన్సువాడ పాముతో సెల్ఫీ దిగుతుండగా పాము కాటు వేయడంతో మృతి చెందిన యువకుడు* NZB, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి* వర్నిలో చిరుత దాడి లేగా దూడ మృతి* కామారెడ్డి సిసి కెమెరా కమాండ్ రూమ్ ను ప్రారంభించిన ఎస్పీ* బోధన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జేలు * నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత*

News September 6, 2024

నిజామాబాద్: 100కు డయల్.. వ్యక్తికి జైలు

image

డయల్ 100కు తరచూ ఫోన్ చేస్తూ న్యూసెన్స్ చేసిన ఓ వ్యక్తికి మెజిస్ట్రేట్ 3 రోజుల జైలుశిక్ష విధించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అప్రోజ్ అనే వ్యక్తి మద్యం సేవిస్తూ తరచూ డయల్ 100కు ఫోన్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ అప్రోజ్‌ను అదుపులోకి తీసుకొని, ఈరోజు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా మూడురోజుల జైలు శిక్ష విధించినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

News September 6, 2024

ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో సబ్ జూనియర్ జట్ల ఎంపిక

image

తూప్రాన్ పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్ హైస్కూల్‌లో 9న ఉమ్మడి మెదక్ జిల్లా సబ్ జూనియర్ ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ మహేందర్ రావు, పోచప్ప, నాగరాజు తెలిపారు. 13 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా కల్లూరు మినీ స్టేడియంలో 34 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే బాల బాలికల మెదక్ జిల్లా జట్ల ఎంపికలు చేపడుతున్నట్లు వివరించారు. వివరాలకు 98665 46563 సంప్రదించాలని సూచించారు.