India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిరూరు గ్రామ శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద నీటి కుంటలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సుమారు 35 ఏళ్ల వయసు గల వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు బ్లాక్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ ధరించారని, మృతుడిని ఎవరైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
ఎండాకాలం నేపథ్యంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధర్మపురి మండలం నేరెళ్లలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకే 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నేరెళ్ల రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలు నేడు రెడ్‌జోన్లో కొనసాగుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన కల్వకుర్తి మండలంలో శనివారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. వంగూరు మండలానికి చెందిన వెంకటేశ్(28), జిల్లెల్ల గ్రామానికి చెందిన రాములు(29) బైక్‌పై కల్వకుర్తి వైపు నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలో తాండ్ర గ్రామ చౌరస్తాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నిజామాబాద్‌లో పట్ట పగలే చోరీ జరిగింది. వినాయక్ నగర్ 100 ఫీట్ల రోడ్‌లోని ఓ ఇంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మధు మోహన్ తన భార్యతో కలిసి శనివారం మధ్యాహ్నం కార్ షోరూమ్‌కు వెళ్లాడు. ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో షాక్‌కు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని 10 తులాల బంగారం, 2 కిలోల వెండి చోరీకి గురైంది. 4వ టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన ఆవుల కనకయ్య(59) వడదెబ్బతో మృతి చెందాడు.3రోజులుగా ఎండ తీవ్రతతో కనకయ్య అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి గెలుపు అంత సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వారే అయినప్పటికీ తమ అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో చెమటలోడుస్తున్నారు. ఈ వారం రోజుల్లో పడే శ్రమ, వ్యూహరచన కీలకం కావడంతో ఆయా అభ్యర్థులు, నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.
చర్ల సరిహద్దు బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి వడిగట్టారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మడవి ఉంగ, మడవి జోగా అనే ఇద్దరు గిరిజన సోదరులను శనివారం హతమార్చారు. టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుత్వాయి గ్రామానికి చెందిన ఆ ఇద్దరిని సమీప అటవీ ప్రాంతంలోకి పిలిచి ప్రజాకోర్టు నిర్వహించి సోదరులకు మరణశిక్ష విధించారు. దీన్ని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ధ్రువీకరించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తనకు బలం బలగమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అన్ని నియోజకవర్గాల కంటే మునుగోడులో మోజార్టీ రావాలని ఆయన కార్యకర్తలను అభ్యర్ధించారు. ప్రతి కార్యకర్త ప్రతి రోజు గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ శనివారం బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని పోస్ట్ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. తన అవసరం బీఆర్ఎస్‌కు లేకనే గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తాను భవిష్యత్‌లో ప్రజా ఉద్యమంలో ఉంటానన్నారు. తన చేనేత కార్మికుల ఉపాధి సమస్యల కోసం పోరాడుతానన్నారు.
బీర్పూర్ మండలంలోని మంగేలా గోండుగూడెమునకు చెందిన కొమురం సోము (58) అనే రైతు శనివారం వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం నువ్వు పంట కోయడానికి తన వ్యవసాయ భూమికి వెళ్లిన ఆయన తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. నీరసంగా ఉందని పడుకోగా.. ఇంతలోనే భార్య నీళ్లు తాగమని లేపే సరికి అప్పటికి చనిపోయి ఉన్నాడని తెలిపారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.
Sorry, no posts matched your criteria.