India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హన్మకొండ జిల్లా దామెరలో నిర్వహించిన ప్రచారంలో వరంగల్ BJP ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్.. కడియం కావ్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఎమ్మెల్యే, బిడ్డ ఎంపీనా? ఇవేమైనా రాజరికమా అని ఎమ్మెల్యే కడియంను ఉద్దేశించి మాట్లాడారు. ముస్లింను పెళ్లి చేసుకున్న ఆమె కడియం కావ్య ఎలా అవుతుందని, ఎండీ కావ్య అవుందని మండిపడ్డారు. NTR, KCR, చంద్రబాబులను వెన్నుపోటు పొడిచిన ఘనత కడియం శ్రీహరిదన్నారు.
పాలమూరులో సాగుకు యోగ్యమైన ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి, మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాలు కృషి చేస్తానని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ MP అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. ‘పార్లమెంట్ పరిధిలో ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించేందుకు పరిశ్రమలు, టూ టైర్ ఐటీ హబ్ లను డెవలప్ చేస్తా. నారాయణపేటకు దక్కకుండా పోయిన సైనిక్ స్కూల్ ను మంజూరు చేయిస్తా’ అని తెలిపారు.
స్నానం చేస్తూ కాలువలో జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చంద్రుగొండ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథన ప్రకారం.. మండలంలోని బెండలపాడు వద్ద సీతారామ ప్రాజెక్టు కాలువ కూలీ పనులకు ఒడిశా నుంచి కొంతమంది వచ్చారు. కాలువలో స్నానం చేస్తుండగా జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండోరోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. తొలిరోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. రెండోరోజు నలుగురు అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. దీంతో ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు దాఖలైన నామినేషన్ల సంఖ్య ఏడుకు చేరింది. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది.
ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా గగ్గుపల్లి గ్రామానికి చెందిన అంజలి కడుపు నొప్పితో వైద్యం కోసం ఆస్పత్రిలో చేరింది. ఈనెల 1వ తేదీ రాత్రి అంజలి మెడలో నుంచి 2 1/2 తులాల గొలుసు, రెండు సెల్ పోన్లను అపహరించారు. ఉదయం అంజలి మెడలోని బంగారు గొలుసు సెల్ ఫోన్లు చోరీకి గురైన విషయం భర్త నరేశ్‌కు తెలిపింది. కేసు నమోదైంది.
HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. SI శ్రీలత వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన సాయి అశ్రితరెడ్డి(22) మాదాపూర్‌లోని ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. గురువారం బాచుపల్లిలోని తన స్నేహితురాలి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో JNTU సిగ్నల్ వద్దకు రాగానే లారీ ఢీకొని మృతి చెందింది.
లోక్‌సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. కాగా, 2021లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ 50శాతానికి మించి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గెలిచారు.
HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. SI శ్రీలత వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన సాయి అశ్రితరెడ్డి(22) మాదాపూర్‌లోని ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. గురువారం బాచుపల్లిలోని తన స్నేహితురాలి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో JNTU సిగ్నల్ వద్దకు రాగానే లారీ ఢీకొని మృతి చెందింది.
WGL-NLG-KMM పట్టభద్రుల MLC నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేయగా.. BRS తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన రాకేష్ రెడ్డిని ప్రకటించింది. BJP నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
పరీక్షలకు భయపడి బెల్లంపల్లి పట్టణంలోని ఇంక్లైన్ బస్తీకి చెందిన మహా శివప్రియ(20) ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ఫార్మసీ కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఫార్మా డీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభమవగా ఉత్తీర్ణత సాధిస్తానో లేదో అని భయాందోళన చెంది ఉదయం హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.
Sorry, no posts matched your criteria.