India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MBNR ఎంపీ అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) విద్యార్హత ఇంటర్ కాగా.. BJP అభ్యర్థి డీకే అరుణ ఎస్ఎస్సీ చదివారు. NGKL లోక్ సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి MBBS చేయగా.. BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ బీటెక్ చదివారు. BRS అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ యూఎస్ఏలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చేశారు. ఈ మేరకు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అభ్యర్థుల గెలుపోటములకు పురుషుల ఓట్లే కీలకం కానున్నాయి. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 37,79,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,45,624 కాగా.. మహిళా ఓటర్లు 18,33,430 మంది ఉన్నారు. నియోజకవర్గంలో మహిళా ఓట్ల కంటే పురుషుల ఓట్లు 1,12,194 అధికంగా ఉన్నాయి.

బర్త్‌డే సందర్భంగా కేక్ తెచ్చుకోవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన HYD షాద్‌నగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. రతన్ కాలనీకి చెందిన బిజ్వి సందీప్ (16) బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కట్ చేయాలని గురువారం రాత్రి బయటికి వెళ్లాడు. కేశంపేట బైపాస్ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న వాహనం అతడిని ఢీకొంది. దీంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన కేయూ అధికారులు అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యథావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
బర్త్‌డే సందర్భంగా కేక్ తెచ్చుకోవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన HYD షాద్‌నగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. రతన్ కాలనీకి చెందిన బిజ్వి సందీప్ (16) బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కట్ చేయాలని గురువారం రాత్రి బయటికి వెళ్లాడు. కేశంపేట బైపాస్ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న వాహనం అతడిని ఢీకొంది. దీంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల విద్యాధికారి బత్తుల భూమన్న మృతి చెందారు. వడదెబ్బతో శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఈఓ మృతి పట్ల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
TPCC ఎన్నారై సెల్, గల్ఫ్ కార్మికుల ఆధ్వర్యంలో MP అర్వింద్‌పై చార్జిషీట్ విడుదల చేశారు. డిచ్‌పల్లి(M)లోని ఓ గార్డెన్స్‌లో కాంగ్రెస్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలలో భారతీయులకు ఇస్తున్న వేతనాలను, BJP 30-50 శాతం వరకు తగ్గిస్తూ సర్క్యూలర్లను జారీ చేసి కార్మకులు పొట్ట కొట్టిందన్నారు. మోదీ ప్రభుత్వం ఆన్‌లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
సర్కారు దవాఖానకు నేను రాను అనేది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు సర్కారీ దవాఖానలలో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తాయని, ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా MLA వెడ్మ బొజ్జు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు జబ్బు చేస్తే స్వయంగా ప్రభుత్వ దవఖానాకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. తాజాగా తన తండ్రి భీంరావు దవడకు క్యాన్సర్ కావడంతో ఆయన ఆదిలాబాద్ రిమ్స్ లో చేర్పించి శస్త్ర చికిత్స చేయించారు
భార్యాభర్తలు గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వెంకటేశ్వర్లు వివరాలు.. గోపాల్‌పేట మండలం ఏదుట్లకి చెందిన తిరుమలయ్య (42), రేణుకతో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరు HYDలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది పాటుగా ఇద్దరి మధ్య గొడవలతో దూరంగా ఉంటున్నారు. పలుమార్లు పెద్దలు కలిపినా మళ్లీ గొడవ పడ్డారు. భర్త మనస్తాపంతో నిన్న ఉరేసుకుని మృతి చెందాడని, కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు.
Sorry, no posts matched your criteria.