India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్యాభర్తలు గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వెంకటేశ్వర్లు వివరాలు.. గోపాల్‌పేట మండలం ఏదుట్లకి చెందిన తిరుమలయ్య (42), రేణుకతో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరు HYDలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది పాటుగా ఇద్దరి మధ్య గొడవలతో దూరంగా ఉంటున్నారు. పలుమార్లు పెద్దలు కలిపినా మళ్లీ గొడవ పడ్డారు. భర్త మనస్తాపంతో నిన్న ఉరేసుకుని మృతి చెందాడని, కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్లుగా బీర్ల నిల్వలు లేవు. ఉభయ జిల్లాల్లో 210 మద్యం దుకాణాలు, 50 బార్లు, మూడు క్లబ్స్ ఉన్నాయి. అయితే గతేడాది మే మొదటి, రెండు వారాల్లో 48 వేల లిక్కర్ కేసులు, లక్ష బీర్ల కేసులను దుకాణాలకు విక్రయించారు. వీటి విలువ రూ.50 కోట్లు. ఈసారి బీర్లకు డిమాండ్ అమాంతం పెరగటంతో ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఏప్రిల్లో రూ.181 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
ఉమ్మడి WGL జిల్లా నుంచి పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరి కీలక పదవులను చేపట్టిన మావోయిస్టులు క్రమంగా పట్టును కోల్పోతున్నారు. WGL కమిషనరేట్ పరిధిలోని 70 మంది మావోయిస్టుల్లో 31 మంది లొంగిపోయారు. మిగతా 20 మంది ఎన్కౌంటర్లు, అనారోగ్యంతో మరణించారు. 19 మంది ప్రస్తుతం పలు హోదాల్లో ఉన్నారు. BHPL, ములుగు జిల్లాకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు. అంటే ఉమ్మడి జిల్లా నుంచి 29 మంది మావోయిస్టు పార్టీలో ఉన్నారు.
HYD జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ నెల 5 నుంచి 26 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడో ఏడాది వారికి మాత్రం ఈ నెల 6 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఉంటాయని వివరించారు. వారు ఇంటర్న్‌షిప్ చేసేందుకు వీలుగా అదనంగా వారం రోజులు ఇచ్చినట్లు తెలిపారు.
HYD జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ నెల 5 నుంచి 26 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడో ఏడాది వారికి మాత్రం ఈ నెల 6 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఉంటాయని వివరించారు. వారు ఇంటర్న్‌షిప్ చేసేందుకు వీలుగా అదనంగా వారం రోజులు ఇచ్చినట్లు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా రాచపట్నంకు చెందిన నాగరాజు, భార్య లావణ్య(40) కొద్దిరోజుల క్రితం తుంబూరు శివారులోని కిషోర్ రెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటలో కాపలాకు వచ్చారు. అయితే గురువారం రాత్రి లావణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ కిరణ్ తెలిపారు.
✔నేడు కొత్తకోటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక
✔నేడు సమీక్ష.. రేపు నీట్ ప్రవేశ పరీక్ష
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్ చిట్టిల పంపిణీ
✔కొనసాగుతున్న హోమ్ ఓటింగ్
✔SSC సప్లమెంటరీ పరీక్షలపై అధికారుల ఫోకస్
✔పలుచోట్ల కేంద్ర బలాలతో కవాతు
✔పకడ్బందీగా కొనసాగుతున్న తనిఖీలు
✔ఎంపీ ఎన్నికలు.. ప్రచారంలో స్పీడ్ పెంచిన నేతలు
ఒక వైపు పార్లమెంట్ ఎన్నికల హోరు కొనసాగుతుండగా.. ఇప్పుడు NLG – WGL-KMM పట్టభద్రుల MLC ఎన్నిక హడావుడి కూడా మొదలైంది. ఈ నెల 27న జరిగే MLC ఎన్నిక పోలింగ్ జరగనుంది. 2 నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)ను ప్రకటించగా, బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన ఏనుగు రాకేష్ రెడ్డి ని ప్రకటించింది. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.
ఈనెల 6వ తేదీన కామారెడ్డికి ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ రానున్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రియాంక గాంధీ మాట్లాడుతారు. ప్రియాంక గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనుల్లో కాంగ్రెస్ నేతలు నిమగ్నం అయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటలో నిర్వహించనున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. MBNR పార్లమెంట్ పరిధిలోని నారాయణపేటలో బహిరంగ సభ తర్వాత ఇదే పార్లమెంట్ పరిధిలోని కొత్తకోటలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.
Sorry, no posts matched your criteria.