India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో ఈ నెల 17న మొహరం పండుగకు వచ్చిన బాలిక భాను(8)తప్పిపోయింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బాలికకు దూరంగా ఉన్న తల్లి అంజమ్మ కిడ్నాప్ చేసి హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు తీసుకువెళ్లింది. తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి బాలికను తండ్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Way2Newsలో ప్రచురితమైన <<13641008>>కథనానికి <<>>స్పందన లభించింది. గార్ల మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు గాడిపెల్లి నర్సమ్మను తన కొడుకులు ఆలనా పాలనా చూసుకోకపోవడంతో రోడ్ల పైనే తిరుగుతూ, భిక్షమెత్తుకుంటూ జీవిస్తోంది. ఈ విషయపై ఈ నెల 16న Way2Newsలో ‘బుక్కెడు బువ్వ పెట్టడం లేదని తల్లి కన్నీటి ఆవేదన’ కథనం ప్రచురితమైంది. దీనిపై గార్ల MRO రవీందర్ స్పందించి నర్సమ్మ కొడుకులకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
గజ్వేల్ మండలం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక CI సైదా తెలిపిన వివరాల ప్రకారం.. ఏటిగడ్డకిష్టాపూర్ R&R కాలనీకి చెందిన రాజేశ్ బంధువైన మురళితో కలిసి ప్రజ్ఞపూర్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి చెట్టును, ఓ భవనం మెట్లను ఢీకొన్నారు. మురళికి గాయాలవగా, రాజేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదైంది.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న NLG మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి గాంధీ మెడికల్ కళాశాలకు, GGH సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. మెడికల్ కళాశాలలో ఐదేళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పలువురు హెచ్వోడీలు 40 మందికి పైగా బదిలీ అయినట్లు తెలుస్తుంది.
రుణమాఫీకి సంబంధించి ఫోన్‌కు ఏమైనా లింకులు వస్తే ఓపెన్ చేయొద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని చెప్పారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. రుణమాఫీ వేళ సైబర్ నేరగాళ్లు రైతుల ఖాతాల్లో ఉన్న డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తారని, ఆధార్ కార్డు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు.
అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య బోధించాలని నిర్ణయించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 1,849 అంగన్వాడీ కేంద్రాల్లోని 1,835 మంది టీచర్లను 49 బృందాలుగా విభజించి ఇస్తున్న శిక్షణ నేటితో ముగుస్తుంది. రోజుకు 2 సార్లు టీ, స్నాక్స్, భోజనానికి రూ.120 కేటాయిస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. కానీ శిక్షణ పూర్తవుతున్నా నగదు అందకపోవడంతో అంగన్వాడీలు నిరాశ చెందుతున్నారు.
✓వరదలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
✓అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఆధారంగా ఖాతాల్లో నగదు జమ అయిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. అందని వారిలో అయోమయం నెలకొంది. జాబితాలో పేర్లు లేవని గుర్తించిన పలువురు పీఏసీఎస్, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నా ఫలితం కానరావడం లేదు. మాఫీ నిబంధనలు, ప్రక్రియ గందరగోళంగా ఉండడంతోనే ఇలా జరిగిందని రైతులు ఆరోపిస్తిున్నారు.
పంట రుణమాఫీపై రైతుల సందేహాలు, ఇబ్బందులు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ‘పరిష్కార విభాగాన్ని’ ఏర్పాటు చేసినట్లు డీఏఓ విజయనిర్మల శుక్రవారం తెలిపారు. రైతులు తమ సమస్యలను టోల్‌ఫ్రీ నం.1950 లేదా 90632 11298ను సంప్రదించాలని సూచించారు. పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏళ్లుగా రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూ సరిహద్దుల్లో స్పష్టత లేకపోవడంతో దాదాపు 55 వేల ఎకరాల్లో రెండు శాఖల మధ్య ప్రస్తుతం హద్దుల వివాదం కొనసాగుతోంది. కృష్ణపట్టి ప్రాంతాలైన మఠంపల్లి, మేళ్లచెర్వు, పాలకవీడు, చింతపలపాలెం, దామెరచర్ల, పీఏపల్లి, చందంపేట, పెద్దవూరు హద్దుల తగాదా ఉంది. HYD సరిహద్దుల్లోనూ ఇదే సమస్య ఉంది. దీంతో సమగ్ర సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Sorry, no posts matched your criteria.