Telangana

News May 3, 2024

HYD: సెక్టార్ అధికారులు, ఏఆర్ఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సెక్టార్ అధికారులు, ఏఆర్ఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పని చేయాలని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించారు.

News May 3, 2024

ADB: విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు

image

ఉమ్మడి ఆదిలాబాద్ BRS స్థానిక సంస్థల MLC దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. MLCగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. తన సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ తీర్పు చెప్పింది. దండె విఠల్‌కు రూ. 50 వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా 2022లో ఎన్నికయ్యారు.

News May 3, 2024

నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థ పటిష్ట పరచాలి: సీపీ

image

నేరాల నియంత్రణకు పోలీస్ పెట్రోలింగ్, నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వైరా డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం జరిగింది. పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ సమీక్ష జరిపారు.

News May 3, 2024

పద్మశ్రీ మొగిలయ్యకు పెన్షన్ చెల్లిస్తున్నాం: CM సీపీఆర్వో

image

ఉమ్మడి పాలమూరుకు చెందిన పద్మశ్రీ మొగిలయ్యకు క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్య రెడ్డి తెలిపారు. మార్చి 31న కూడా ఆయన ఖాతాలో రూ.20 వేల పెన్షన్ జమ అయినట్లు Xలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులను ఎప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. అయితే ఏప్రిల్లో పెన్షన్ కొంచెం ఆలస్యం అవుతుందని మొగిలయ్యకు ముందే ఫోన్ చేసి చెప్పినట్లు అధికారులు తెలిపారు.

News May 3, 2024

NZB: అది వడ దెబ్బ మృతి కాదు: DMHO

image

జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నీరడి ఎల్లవ్వ మూత్ర పిండ వైఫల్యం కారణంగా మృతి చెందిందని కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లక్ష్మణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వడదెబ్బతో మృతి చెందినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని నీరడి ఎల్లవ్వ బుధవారం మధ్యాన్నం ఒంటి గంటకు ఆరోగ్యంగానే ఉండి ఇంటి ముందు మేకల పెంపకం పనిలో నిమగ్నమై ఉండగా ఆకస్మాత్తుగా కుప్పకూలిందన్నారు.

News May 3, 2024

‘కాంగ్రెస్ కోఆర్డినేటర్ల జాబితా విడుదల’

image

కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ల జాబితా విడుదల చేసింది. పాలేరు స్వర్ణకుమారి (కాంగ్రెస్) సరళ (సిపిఎం) సురేష్ (CPI), ఖమ్మం జావేద్ (కాంగ్రెస్) శ్రీకాంత్ (CPM) జితేందర్ రెడ్డి (CPI), మధిర శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్) వేంకటేశ్వర్లు (CPM) జలందర్ రెడ్డి (CPI), వైరా రోశయ్య (కాంగ్రెస్) వీరభద్రం (CPM) బాబు (CPI), సత్తుపల్లి నరసింహారావు (కాంగ్రెస్) భారతి (CPM), ఆదినారాయణ (CPI)లను నియమించారు.

News May 3, 2024

సిద్దిపేట: సైబర్ వలకు చిక్కిన మహిళ

image

సిద్దిపేటకు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాడి చేతిలో మోసపోయింది. సీపీ తెలిపిన వివరాలు.. ఓ వ్యక్తి ఫోన్ చేసి ఓ ప్రముఖ కంపెనీలో బ్యాక్ డోర్ జాబ్స్ ఉన్నాయని చెప్పగానే నమ్మిన మహిళ నిందితుడు చెప్పిన విధంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విడతలుగా రూ.16,75,750 పంపించింది. అనంతరం ఆ నంబర్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన ఆమె వెంటనే 1930కి ఫిర్యాదు చేసినట్లు సీపీ తెలిపారు.

News May 3, 2024

ఖమ్మం: ఎర్లీ బర్డ్ రాబడి రూ.15.15 కోట్లు

image

ఐదు శాతం రాయితీతో ఆస్తి పన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ అవకాశాన్ని 26,646 మంది భవన యజమానులు వినియోగించుకున్నారు. తద్వారా ఆయా నగర, పురపాలికలకు రూ.15.15 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా ఖమ్మం నగరపాలిక సంస్థ రూ.9.73 కోట్లు, అత్యల్పంగా ఇల్లెందు రూ. 30 లక్షలు వసూలు చేసింది.

News May 3, 2024

NRPT: సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్, x, ఇతర సోషల్ మీడియాలలో అనుచిత వ్యాఖ్యలు, మత విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని అన్నారు.

News May 3, 2024

సిద్దిపేట: రైస్ మిల్ యజమాని ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ లచ్చపేట వార్డుకు చెందిన వ్యాపారవేత్త కాచం నాగార్జున(57) గ్రామంలోని మహేశ్వర రైస్ మిల్లులో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. నాగార్జున గత కొన్ని సంవత్సరాలుగా ఆ రైస్ మిల్లు నడుపుతున్నారు. ఇదే క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.