India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP అభ్యర్థులు తలపడనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల ఎంపీ అభ్యర్థులు కార్నర్ మీటింగ్, ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు రేపు కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంది. తానంటే తాను స్థానికుడని తనను ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఆయా పార్టీల అభ్యర్థులు ప్రజలను వేడుకుంటున్నారు. కాగా ఎన్నికల బరిలో గెలిచేది ఎవరు కామెంట్ చేయండి.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
బీజేపీ గెలిచే 400 సీట్లలో ఖమ్మం సైతం ఒకటిగా ఉండాలని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. ఖమ్మం 2టౌన్ లో శుక్రవారం జరిగిన రోడ్ షోలో అయన మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలతో ఇక్కడ ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని, అభివృద్ధికి ఖమ్మం జిల్లా ఆమడ దూరంలో ఉన్నదని అన్నారు. తనకు ఈసారి ఎంపీగా అవకాశం ఇస్తే కేంద్రం నుండి ప్రత్యేక నిధులతో ఖమ్మం అభివృద్ధి చేసేలా తాను చూసుకుంటానని అన్నారు.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
ఈ నెల 6న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నర్సంపేటకి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వస్తున్నారు. ఈ సందర్భంగా BJP బహిరంగ సభ ఏర్పాట్లు గురించి, సభా ప్రాంగణం కోసం BJP వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నర్సంపేటలో స్థల పరిశీలన చేశారు.
ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని హానుమకొండ కలెక్టర్ స్నిగ్ధ పట్నాయక్ అన్నారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కలెక్టర్ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
అడవుల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటాపోటీ ప్రచారంతో ముచ్చటగా మూడు పార్టీలు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీజేపీ, గెలిచి నిలిచేందుకు బీఆర్ఎస్, కొత్త ఆశలతో కాంగ్రెస్.. ముచ్చటగా మూడు పార్టీలు సై అంటే సై అంటూ దూసుకుపోతున్నాయి.
ప్రమాదవశాత్తు మంటలంటుకుని ఓ రైతు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో చోటుచేసుకుంది. సిరికొండ మండలంలోని పెదవాల్గోట్ గ్రామానికి చెందిన లాయిడి కిషన్(58) పోత్నూర్ గ్రామ శివారులోని తన పంట పొలం వరి కంకులకు నిప్పు పట్టాడు. ఈ క్రమంలో మంటలంటుకుని కిషన్ మృతిచెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంగనర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణం ఇందిరానగర్‌కు చెందిన రమ తన కుమారుడితో కలిసి బైక్‌పై హుజూరాబాద్ నుంచి రాములపల్లి గ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలో ఎలాబోతారం కమ్యూనిటీ హాల్ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయం కావడంతో రమ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఉమ్మడి పాలమూరులోని రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ భావిస్తోంది. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం MBNR పరిధిలో 4 సార్లు, NGKL పరిధిలో ఒకసారి పర్యటించారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ MLAలకు ఆమె దిశానిర్దేశం చేశారు.
Sorry, no posts matched your criteria.