Telangana

News May 3, 2024

సిద్దిపేట‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

సిద్దిపేటలోని హోసింగ్ బోర్డు కమాన్ వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడు స్థానికంగా ఓ బిల్డర్ వద్ద సూపర్వైజర్‌గా పనిచేస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సింది.

News May 3, 2024

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న పొలిటికల్ హీట్!

image

లోక్ సభ ఎన్నికల గడువు తేదీ దగ్గర పడుతుండడంతో ఖమ్మం జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రచారాలకు మరింత పదును పెట్టాయి. ఆయా పార్టీల అధినేతలు కూడా ప్రచారానికి వస్తుండడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది.

News May 3, 2024

ఖమ్మం MP బ్యాలెట్ నమూనా విడుదల

image

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల నమూనా బ్యాలెట్‌ను గురువారం ఎన్నికల అధికారులు అధికారికంగా విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. ఖమ్మంలో 32 మంది పోటీలో ఉన్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 

News May 3, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,500 జెండాపాట పలకగా, క్వింటా నాన్ ఏసీ మిర్చి ధర రూ. 19,050 జెండాపాట పలికింది. అలాగే, పత్తి ధర రూ.7, 100జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు మిర్చి, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. రైతులు మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News May 3, 2024

HYD: ఎర్రకుంటలో మృతదేహం లభ్యం

image

ఎర్రకుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధుబన్ కాలనీలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు గురువారం చెత్తను శుభ్రం చేస్తుండగా మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 3, 2024

HYD: ఎర్రకుంటలో మృతదేహం లభ్యం

image

ఎర్రకుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధుబన్ కాలనీలో GHMC పారిశుద్ధ్య కార్మికులు గురువారం చెత్తను శుభ్రం చేస్తుండగా మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 3, 2024

ప్రజలకు అందుబాటులో ఉంటూ గెలిపించండి: డీకే అరుణ

image

ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తనను గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రజలను కోరారు. శుక్రవారం ఆమె మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రిగా ఉన్న సమయంలో గ్రామానికి పైప్ లైన్ వేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించానని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు.

News May 3, 2024

పట్టభద్రుల పోలింగ్ శాతం ఈసారైనా పెరిగేనా..

image

ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. 2015లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల స్థానంలో 54.62 శాతం పోలింగ్‌ నమోదైతే 2021లో 76.35శాతానికి పెరిగింది. ఈసారి పట్టభద్రుల ఓటర్లు తగ్గటంతో పోలింగ్‌ శాతం ఏ మేరకు నమోదవుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

News May 3, 2024

KMM: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న ప్రసవాలు!

image

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గతంలో ఈ ఆస్పత్రిలో కాన్పులు చేయించుకోవడానికి వెళ్లాలంటే గర్భిణులు భయపడేవారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం ఆస్పత్రులను ఆధునీకరించి అత్యాధునిక పరికరాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తూ.. అన్నిరకాల పరీక్షలు చేస్తూ మెరుగైన వైద్యం అందిస్తోంది. ఈ నేపథ్యంలో గర్భిణులు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

News May 3, 2024

వేసవిలో స్పెషల్ ట్రైన్ల జాడేది?

image

ఏటా వేసవి కాలంలో రైల్వే శాఖ ప్రధాన ప్రాంతాలకు అనుసంధానం చేసేలా ప్రత్యేక రైళ్లను నడిపించేది. కానీ ఈ ఏడాది ప్రత్యేక రైళ్లను ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. ఇకనైనా ప్రత్యేక రైళ్లను నడిపించడమే కాక ఎక్స్ప్రెస్ రైలు బోగీల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు. వేసవి సెలవుల్లో విహారయాత్రలకు, సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.