Telangana

News May 3, 2024

MBNR: పీయూ సిబ్బంది పరీక్ష వాయిదా

image

పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ)లో పనిచేస్తున్న తాత్కాలిక బోధనేతర ఉద్యోగులకు నిర్వహిస్తామన్న పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 19న అధికారులు పీయూ బోధనేతర సిబ్బందికి పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ఈ నెల 3, 4 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదా వేసిన పరీక్షలను ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొంటూ పీయూ అధికారులు మరో సర్క్యులర్ జారీ చేశారు.

News May 3, 2024

NZB: రెండు నియోజకవర్గాలు.. 3768 పోలింగ్ బూత్‌లు

image

నిజామాబాద్ MP స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జహీరాబాద్ MPస్థానంలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. నిజామాబాద్ పరిధిలో నిజామాబాద్ రూరల్ 293, నిజామాబాద్ అర్బన్ 289, జగిత్యాల 254, కోరుట్ల 252, బాల్కొండ 246, బోధన్ 246, ఆర్మూర్ 217 బూత్‌లు ఉన్నాయి. జహీరాబాద్ పరిధిలో జహీరాబాద్ 313, అందోల్ 313, నారాయణఖేడ్ 296, ఎల్లారెడ్డి 270, కామారెడ్డి 266, బాన్సువాడ 258, జుక్కల్ 255 బూత్‌లు ఉన్నాయి.

News May 3, 2024

NLG: మాజీ ఎమ్మెల్యే క్వార్టర్ సీల్ తొలగించాలని హైకోర్టు ఆదేశం

image

సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కు సంబంధించి NSP క్వార్టర్‌కు అధికారులు వేసిన సీల్‌ను 48గంటల్లో తొలగించాలని గురువారం హైకోర్టు అధికారులను ఆదేశించింది. సాగర్ హిల్ కాలనీలోని EE 19 క్వార్టరు మాజీ ఎమ్మెల్యే భగత్ క్యాంప్ ఆఫీస్‌గా అలాట్ చేయించుకున్నారు. గతేడాది NOVలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భగత్ ఓటమి చెందినప్పటికీ క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేయకపోవడంతో NSP అధికారులు సీల్ వేసిన విషయం తెలిసిందే.

News May 3, 2024

రేపు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 4న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం హెలీప్యాడ్ స్థలాన్ని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి, ఇతర అధికారులు పరిశీలించారు. ముందుగా మండల పరిషత్ సమీపంలో హెలికాప్టర్ దిగే అవకాశాలను పరిశీలించారు. అనంతరం సంకిరెడ్డి‌పల్లి గుంపుగట్టు వద్ద పరిశీలించి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

News May 3, 2024

వామ్మో.. భగభగ మంటున్న భానుడు..!

image

నల్గొండ జిల్లాలో భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో జిల్లాలో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం హాలియా మండలం ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదై జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. అలాగే నాంపల్లిలో 46.4 డిగ్రీలు, మాడుగులపల్లి, కేతేపల్లి, కట్టంగూర్ మండల కేంద్రాలు, చందంపేట మండలం తెల్దేవరపల్లి తదితర ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 3, 2024

వరంగల్: ఎన్‌కౌంటర్లో మావోయిస్టు సుష్మిత మృతి?

image

ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లా టెక్మెట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందింది HNK జిల్లా హసన్‌పర్తికి చెందిన తిక్క సుష్మిత కాదని కుటుంబీకులు తెలిపారు. ఎన్కౌంటర్లో సుష్మిత మృతి చెందినట్లు పోలీస్ వర్గాల సమాచారం మేరకు కుటుంబీకులు ఛత్తీస్‌గఢ్‌ వెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌‌లో నారాయణపూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని పరిశీలించారు. ఆ మృతదేహం సుష్మితది కాదని వెనుదిరిగారు.

News May 3, 2024

నేడు గోదావరిఖనికి మాజీ CM KCR

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మాజీ CM KCR ఈరోజు సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో జరిగే రోడ్డు షోలో పాల్గొంటారని BRS అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజల్లో BRSకు వస్తున్న ఆదరణ ఓర్వలేక రోడ్డు షోను ఆపేందుకు అధికార పార్టీ పాలకులు దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతం చేయాలన్నారు.

News May 3, 2024

వడదెబ్బకు ఖమ్మం జిల్లాలో ముగ్గురి మృతి

image

చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన వృద్ధుడు పూనాటి రామయ్య (83) వడదెబ్బతో గురువారం మరణించారు. రెండు రోజులుగా ఎండ తీవ్రతను తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా చికిత్స పొందుతూ మరణించారు. అలాగే దుమ్ముగూడెం మండలంలో తోడెం వెంకటేశ్(28), ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ప్రసాద్(57) వడదెబ్బకు గురై గురువారం మృతి చెందారు.

News May 3, 2024

ప్రచారానికి మిగిలింది.. ఇంకా 9 రోజులే

image

ఖమ్మం లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. ప్రచారానికి ఇంకా 9 రోజులే మిగలడంతో అభ్యర్థులు హోరాహోరీగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంపైనే దృష్టిసారిస్తున్నారు . ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎవరికి వారు ధీమాగా ప్రచారాన్ని ఉధృతం చేశారు.

News May 3, 2024

పోస్టులు పెడుతున్నారా.. జాగ్రత్త సుమా!

image

ఖమ్మం జిల్లా సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్కు , రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటారు.