Telangana

News September 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడ మైనార్టీ గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.
@ సిరిసిల్లకు చెందిన గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ మృతి.
@ మల్హర్ మండలంలో ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
@ ఓదెల మండలంలో ట్రాలీ ఆటో బోల్తా పలువురికి గాయాలు.
@ వినాయక పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితికి ముస్తాబైన మండపాలు.

News September 6, 2024

వాజేడు: విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

image

విద్యార్థుల ఆరోగ్యం పట్ల టీచర్లు, వార్డెన్లు జాగ్రత్త వహించాలని మంత్రి సీతక్క అన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు. కాగా ఈరోజు గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యాబోధన, మౌలిక వసతులు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. గిరిజన, గురుకుల హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.

News September 6, 2024

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: హరీశ్ రావు

image

తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. కలిసి పోరాటం చేద్దాం అని రాష్ట్ర రైతులకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో సందర్శించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్‌కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం అని స్పష్టం చేశారు.

News September 6, 2024

వినాయక చవితిని శాంతియుతంగా జరిగేలా చూడాలి :కలెక్టర్

image

వినాయక చవితి పండుగ ను శాంతియుత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

News September 6, 2024

MBNR: అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళ డిగ్రీ, పీజీ కళాశాల ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కామర్స్, ఫిజిక్స్, ఉర్దూ, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బోటనీ, మ్యాథమెటిక్స్, జువాలజీ, హిస్టరీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 6, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో EAPCET/NEET/JEE తరగతులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థులకు EAPCET/NEET/JEE తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. తరగతులకు సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News September 6, 2024

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా

image

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భక్తులు వినాయకుడిని పూజిస్తారని మంత్రి సురేఖ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యేడాది వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి సురేఖ ప్రకటించారు.

News September 6, 2024

మంచిర్యాల: రైలు ఢీకొని ఇంటీరియర్ వర్కర్ మృతి

image

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ కే. సంపత్ వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని సున్నంబట్టి వాడకు చెందిన రాజమల్లు (37) ఇంటీరియర్ వర్క్ చేస్తుంటాడు. ఇవాళ అతను రైలు పట్టాల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొట్టింది. అతనికి తీవ్రగాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సంపత్ తెలిపారు.

News September 6, 2024

ప్రైవేట్ ఆస్పత్రుళ్లుగా ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు: దమోదర్ రాజనర్సింహ

image

ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లును అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. కోటి మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో నూతనంగా రూ.121 కోట్లతో నిర్మించనున్న హాస్టల్ భవనాల నిర్మాణానికి మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా వైద్యారోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన 282మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.

News September 6, 2024

ములుగు: సర్వే చేస్తున్న ఫారెస్ట్ అధికారులు

image

తాడ్వాయి-మేడారం అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరగడంపై అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించనుంది. దీనిలో భాగంగా ఫారెస్ట్ అధికారులు సర్వే చేపట్టారు. విపత్తు కారణంగా 204కు పైగా హెక్టార్లలో దాదాపు 70వేల చెట్లకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ విపత్తులో 60,70 రకాల చెట్లు నేలకులాయి. రెండు, మూడు రోజుల్లో అంచన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.