India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MBNR, NGKL పార్లమెంట్ పరిధిలో కలిపి మొత్తం 34,20,724 మంది ఓటర్లు ఉన్నారు. MBNRలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 8,32,256, మహిళలు 8,50,172, ఇతరులు 42 మంది ఉన్నారు. NGKL పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8,64,875, మహిళలు 8,73,340, ఇతరులు 39 మంది ఓటర్లు ఉన్నారు.
✓పలు శాఖలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
✓పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
✓పార్లమెంట్ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
చికెన్ కర్రీలో పడి BRS కార్యకర్తకు తీవ్ర గాయాలైన ఘటన ధారూరు మండలంలో చోటుచేసుకుంది. ధారూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం భోజనానికి వెళ్లగా.. కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త మల్లయ్య.. కార్యకర్తల తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్ బోగాణలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
చికెన్ కర్రీలో పడి BRS కార్యకర్తకు తీవ్ర గాయాలైన ఘటన ధారూరు మండలంలో చోటుచేసుకుంది. ధారూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం భోజనానికి వెళ్లగా.. కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త మల్లయ్య.. కార్యకర్తల తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్ బోగాణలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని తిప్పలమ్మ గూడెం గ్రామానికి చెందిన రైతు వడదెబ్బతో గురువారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిని వివరాలు.. తోట జాన్ రెడ్డి వ్యవసాయ పనుల ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరారు. ఎండదెబ్బతో తీవ్ర అలసటకు గురై మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
బెజ్జూరు మండలంలోని గబ్బాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్(40) అనే వ్యక్తి గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 2రోజుల క్రితం దహేగాం మండలంలోని పోలంపల్లిలో జరిగిన శుభకార్యానికి వెళ్ళాడు. ఈ క్రమంలో వాంతులు, విరోచనాలు కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య జానభాయ్ , ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ఈనెల 4 వరకు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించుకునేందుకు బోర్డు గడువు పెంచిందని డీఐఈఓ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2 వరకు ఉన్న ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుంలేకుండా 4 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో ఓ వ్యక్తి ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. గుర్తుతెలియని ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు అనే లింక్‌ను వాట్సాప్‌లో పంపగా ఆ లింకును ఓపెన్ చేయగానే అతని అకౌంట్లో నుంచి సుమారు లక్ష రూపాయల నగదు కట్టయ్యాయని దీంతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం చాలా విదేశాలకు వెళ్తుంటారు. ఒక్క బాల్కొండ నుంచే సుమారు 2,200 మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరందరికి రాకపోకలకు విమానాశ్రయం అనేది సాధారణ అవసరంగా మారింది. జక్రాన్‌పల్లిలో ఏర్పాటు చేస్తామన్న విమానాశ్రయం హమీ ఆచరణకు నోచుకోలేదు. జక్రాన్‌పల్లిలో 1200 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. కానీ నిర్మాణ పనులకు మాత్రం నోచుకోలేదు.
పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు పోలీసులు ఇతర శాఖల అధికారులు సంయుక్త తనిఖీల్లో రూ.2,62,96,691 పట్టుబడింది. ఇందుకు సంబంధించి 95 కేసులు నమోదయ్యాయి. మద్యం సరఫరాకు సంబంధించి 148 కేసులు నమోదు కాగా.. రూ.10.83 లక్షల విలువచేసే 3,359 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. వీటితో పాటు 338 గ్రాముల బంగారం, 5.12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.